Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News K Narayana Swamy Fires On Chandrababu Naidu

K Narayana Swamy: అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్

Published Date :October 20, 2022 , 7:31 pm
By NTV WebDesk
K Narayana Swamy: అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

K Narayana Swamy Fires on Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌లపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శలు గుప్పించారు. తనని ఎవరైనా ప్యాకేజ్ స్టార్ అని పిలిస్తే.. ఆ వైసీపీ నేతలను చెప్పుతో కొడతానని పవన్ కళ్యాన్ అనడం ఏమాత్రం సరికాదని అన్నారు. స్పెషల్ స్టేటస్‌ను వదిలి.. ప్యాకేజి క్రింద ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు ధనదాహం కోసం అమ్మేశారని ఆరోపించారు. చంద్రబాబుకు అప్పుడే ప్యాకేజీ బాబు అని ముద్ర పడిందని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి కూడా అదే ముద్ర పడిందని చెప్పారు. కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్‌కి లేదని.. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ ఏమయ్యాడని ప్రశ్నించారు. ఈ రోజు కుల, మత, పార్టీల రాజకీయంతో ముందుకు పరిగెడుతున్నారని విమర్శించారు. అదే సీఎం జగన్ మాత్రం కాపుల్లో ఐదు మందికి మంత్రి పదవి, ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు.

అంతకుముందు.. మూడు రాజధానులకు అనుకూలంగా గళం విప్పిన నారాయణ స్వామి, అమరావతి ప్రాంత రైతుల పాదయాత్రను కూడా తప్పుపట్టారు. దీనిని తెరవెనుక ఉండి చంద్రబాబు నడిపిస్తున్నారని ఆరోపణలు చేశారు. 29 గ్రామాల ప్రజలు మాత్రమే బాగుపడాలని చంద్రబాబు కోరుకుంటోన్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సారథ్యంలో తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే మూడు రాజధానుల విధానాన్ని తెరమీదకి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల వారిని సమదృష్టితో చూస్తున్నారన్నారు. పేద ప్రజలు బాగుపడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, కొన్ని కార్పొరేట్ సంస్థలకు మేలు కలిగించేలా, తన బినామీల బాగు కోసం చంద్రబాబు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తోన్నాడని మండిపడ్డారు. తెలంగాణ నుంచి వేరు పడిన సమయంలో హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని.. ఇప్పుడూ అలాంటి వ్యవస్థ కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati Farmers Yatra
  • AP Capital Issue
  • Chandrababu Naidu
  • K Narayana Swamy
  • pawan kalyan

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions