ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో భారీ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. తాజాగా మరో జాబ్ మేళా ప్రకటనను APSSDC విడుదల చేసింది. కృష్ణా జిల్లా నందిగామలో ఈనెల 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ జాబ్ మేళాలో వరుణ్ మోటార్స్, మీషూ, కెస్ కార్పొరేషన్ లిమిటెడ్, డీమార్ట్ వంటి సంస్థలు నియామకాలు చేపట్టనున్నాయి.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 27న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్‌లో అధికారులు స్పష్టం చేశారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు. నందిగామలోని ఎంఆర్ఆర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు. రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్సు కాపీలు, పాస్‌పోర్టు సైజ్ ఫోటోలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 90149 43757, 99888 53335 నంబర్లలో సంప్రదించవచ్చు.
#ap_govt #APSSDC #jobnotification pic.twitter.com/6EgC9rJuD8
— Viral Jobs (@viral_jobs) December 24, 2021