JC Prabhakar Reddy Gets 41 CRPC Notice From Police Over College Wall Issue: జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ఎదురుగా ఉన్న జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జేసీకి పోలీసులు తాజాగా 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారు. అయితే.. ఈ నోటీసు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఆపాలని తాను ఎక్కడా అనడం లేదన్నారు. కేవలం సర్వే చేసి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నానని అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా.. కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు సర్వే చేయాలని అధికారులను కోరారని, కానీ ఫలితం లేదని వాపోయారు.
Gurukula Exam: గురుకుల పరీక్షలో సాంకేతిక సమస్య..? ఇంకా స్టార్ట్ కాలే..!
మున్సిపల్ ఉద్యోగుల కోసం 1983లో లే అవుట్‌లోనే 50 అడుగులు రోడ్డు ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 2022లో 60 అడుగులతో మున్సిపల్ అఫ్రూవల్ ఉందని.. ఆర్ అండ్ బి అధికారులకు ఆర్జీలు పెట్టుకున్నానని గుర్తు చేశారు. కానీ.. ఇప్పుడున్న ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశిస్తూ) అన్నీ సగం సగం పనులు చేసి, ఊరును పాడు చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. పోలీసులు బందోబస్తు పెట్టుకుని గోడ కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదికను కూల్చడానికి 10 నిమిషాలు పట్టలేదని.. అదే విధంగా ప్రహరీ గోడ ఎన్ని రోజుల్లో కట్టారో, అన్ని నిమిషాల్లోనే కూలుస్తామని హెచ్చరించారు. ఐఏఎస్ & ఐపీఎస్‌కు సెల్యూట్ చేస్తున్నానని.. ఈ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని.. మీకసలు నిద్రెలా పడుతోందని జేసీ ప్రశ్నించారు.
Rahul Gandhi: పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్‌గాంధీకి నివాళులర్పించిన రాహుల్