విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా కార్మికులు చేస్తున్న దీక్షకు జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. కూర్మన్న పాలెంలోని బహిరంగ సభలోపవన్ మాట్లాడారు. నా సభలకు జనం వస్తారు. కానీ ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తారన్నారు. నాకు ఒక ఎంపీ కూడా లేడు, ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ వాళ్లు పట్టుకెళ్లారు. అయినా ప్రజల సమస్యల కోసం నిలబడేది మేమేనని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ లేఖలు రాసిందని చెబుతుంది.…