Site icon NTV Telugu

Janasena: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై జనసేన ఫైర్

Jsp Kiran

Jsp Kiran

తిరుమలలో అమలవుతున్న విధానాలు, ధర్మారెడ్డి తీరుపై జనసేన మండిపడింది. ప్రభుత్వం మాదనే ఉద్దేశంతోనే ఇష్టమొచ్చినట్టు తిరుమలలో వ్యవహరిస్తున్నారని ఈవో ధర్మారెడ్డిపై మండిపడ్డారు జనసేన నేత కిరణ్ రాయల్. టీటీడీలో ఏదో జరుగుతోంది, జవహర్ రెడ్డి ని హడావుడిగా బదిలీ చేయడం వెనక కారణం ఏంటి…?గడువు ముగిసిన టీటీడీ ఈఓగా ధర్మారెడ్డిని కొనసాగింపు ఎందుకు….? అని ఆయన ప్రశ్నించారు.

ధర్మారెడ్డి దేవస్థానం లా మార్చేశారు. ఏపీలో ఇంకెవరు ఐఏఎస్ లు లేరా…? ఐడిఈయస్ హోదా లో ఉన్న ధర్మారెడ్డి స్టేట్ సర్వీసెస్ సమయం పూర్తైన, సెంట్రల్ సర్వీస్ కు ఎందుకు పోవడం లేదు..? వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే లు కూడా ధర్మారెడ్డి ఎప్పుడు బదిలీ అవుతారో అని ఎదురు చూస్తున్నారు. ధర్మారెడ్డి టీటీడీ కి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ధర్మారెడ్డి పదవీ కాలం కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ పంపా క్షేత్రం కిస్కింధా వారు ప్రధానికి లేఖ రాశారు. టీటీడీలో ఉన్న కొంత మంది పెద్దలు మమల్ని బెదిరిస్తున్నారు, జనసైనికులు తాటాకు చప్పుళ్లకు భయపడరు. ధర్మారెడ్డి పదవీకాలం కొనసాగిస్తే ఉద్యమాలు చేస్తాం అని కిరణ్ హెచ్చరించారు.
Telangana:రాజ‌న్న ఆల‌యం వద్ద దారుణం.. 28 రోజుల శిశువు కిడ్నాప్‌

Exit mobile version