NTV Telugu Site icon

Sajjala Ramakrishna: సజ్జల వద్దకు తాడికొండ పంచాయితీ.. ఆయన్ను తొలగించాలని శ్రీదేవి డిమాండ్‌

Sajjala

Sajjala

గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. తాడికొండ పంచాయితీ ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వదరకు చేరడంతో ఇది చర్చకు దారితీస్తోంది. అయితే.. తాడికొండ నియోజకవర్గ వైసిపి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆమె వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక డొక్కాను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని ఎమ్మెల్యే వర్గం డిమాండ్ చేస్తోంది. ఈనేపథ్యంలో.. తాజాగా ఎమ్మెల్యే శ్రీదేవి భారీగా అనుచరగణంతో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసారు. ఇక తాడికొండ బాధ్యతలు డొక్కాకు అప్పగించడంతో స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని, వెంటనే ఆయనను తొలగించాలని శ్రీదేవి డిమాండ్ చేసారు. అంతేకాకుండా.. అదనపు ఇన్ చార్జ్ నియామకంతో నియోజకవర్గంలో తన ఇమేజ్ డ్యామేజీ అవుతుందని.. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరనే ప్రచారం కూడా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇక వైసీపీ గెలిచిన 151 నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల స్థానిక ఎమ్మెల్యేలపై కంప్లయింట్లు ఉన్నాయి.

మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై సీఎం జగన్ అసంతృప్తితో ఉన్నారని టాక్‌. అంతేకాదు, గడప గడపలో పాల్గొనకపోవడం.. ప్రజల్లోకి వెళ్లకపోవడం.. నియోజకవర్గాలకు దూరంగా ఉండటం. ఇలా కొన్ని కారణాలతో ఎమ్మెల్యేల విషయంలో జగన్ ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాడికొండలో డొక్కాకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో.. ఎమ్మెల్యే శ్రీదేవి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవుతోంది. ఇక నియోజకవర్గంలోకి వస్తున్న డొక్కా మాణిక్యవరప్రసాద్ కు అడుగడుగునా శ్రీదేవి మద్దతుదారులు అడ్డుపడుతున్నారు. దీంతో.. వైసీపీలో ఈ అంతర్గత పోరు ప్రతిపక్షాలకు అనుకోని ఆయుధంగా మారుతోంది. ఇక శ్రీదేవి బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలకు జగన్ చెక్ పెడతారని.. వారంతా ఆల్టర్నేట్ వెదుక్కోవాల్సిన అవసరం వస్తుందని అంటున్నారు.

ఇక గతంలో గన్నవరం పంచాయితీ కూడా ఇలాగే హాట్ హాట్ గా సాగి ముగిసిపోయింది. అంతేకాదు హిందూపురం విషయంలో అంతర్గత పోరు ఇంకా సమసిపోలేదు. మరోసారి ఇప్పుడు కొత్తగా తాడికొండ నియోజకవర్గం గొడవ మొదలైంది. దీంతో.. ఈ పంచాయితీ సజ్జల వద్ద ఫైనల్ అవుతుందా.. లేక సీఎం వద్దకు వెళ్తుందా అనేది వేచి చూడాలి.
Nellore YCP : నెల్లూరు వైసీపీలో ఆయన రాజకీయ స్టైలే వేరు.. అందుకే స్వపక్షంలో విపక్షంగా శ్రీధర్ రెడ్డి