Kurnool: భార్య ఆత్మహత్య చేసుకున్న 6 ఏళ్లకు భర్తకు జైలు శిక్ష.. కారణం ఇదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool: విలువ తెలిసిన వాళ్ళకి దొరకదు. దొరికిన వాళ్లకి విలువ తెలియదు అన్నట్లు.. పెళ్లికాక కొందరు బాధపడుతుంటే.. పెళ్లి చేసుకుని నమ్మి వెంట వచ్చిన భార్యను చిత్రహింసలు పెట్టి అర్ధాయుష్షుతో తనువు చాలించేలా చేస్తున్నారు మరికొందరు. కన్నవాళ్ళను వదిలి కట్టుకున్న భర్తే జీవితం అనుకుని వచ్చిన భార్యను వరకట్నం కోసం వేధిస్తున్నారు. వేధింపులు తాళలేని మహిళలు తనువు చాలిస్తున్నారు. వరకట్నం వేధింపులతో మహిళలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు గతంలో కోకొల్లలు. అలానే చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. నిందితులకు ఏనాటికైనా శిక్ష పడుతుంది. న్యాయస్థానం కేసు నమోదైన సంవత్సరాల తరువాత నిందితులను శిక్షించిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే మరోసారి తాజాగా కర్నూలులో వెలుగు చూసింది.
Also Read
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
వివరాలలోకి వెళ్తే.. కర్నూలు జిల్లా లోని జోహారాపురంలో షాజహాన్ బీ అనే మహిళను వరకట్నం కోసం తన భర్త ముక్తార్ బాష వెంధించాడు. కాగా భర్త వేధింపులు తాళలేక షాజహాన్ బీ 2017 లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ నేపథ్యంలో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆమె భర్త ముక్తార్ భాష పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. అయితే ముక్తార్ బాష పై ఆరోపణలు ఋజువుకావడంతో 6 ఏళ్ళ తరువాత తాజాగా అతనికి న్యాయస్థానం శిక్ష విధించింది. కాగా ముక్తార్ బాషాకు 3 సంవత్సరాల జైలు శిక్ష తో పాటుగా 50 వేలు జరిమానా విధించారు కర్నూలు ఫోర్త్ అదనపు సెషన్స్ జడ్జి.
తాజావార్తలు
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!