NTV Telugu Site icon

Manyam district : మన్యం జిల్లాలో దారుణం.. షార్ట్ ఫిల్మ్ మోజులో ఆత్మహత్య చేసుకున్న యువకుడు..

Untitled 1

Untitled 1

Manyam district: సినీ రంగం పైన ఆసక్తి ఉండడం తప్పు కాదు. కానీ ఇష్టం ఉన్న పనిని ప్రారంభించాలి ఒక్కసారిగా నేమ్ ఫేమ్ సంపాదించాలి అనుకుని ఓ ప్లాన్ లేకుండా అప్పులు చేస్తేనే ముప్పు. ఇలా సినీ రంగం పైన అవగాహనా లేకుండా అప్పులు తెచ్చి సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళు గతంలో కోకొల్లలు. అయితే ఇప్పుడు ఆకోవలోకి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ పైన ఓ యువకుడికి ఉన్న ఆసక్తి అతని ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మన్యం జిల్లా లోని పార్వతీపురం లోని మణికంఠ కాలనీకి చెందిన దుప్పలపూడి సునీల్ అనే యువకుడు సినిమాలపైన ఉన్న ఇష్టంతో.. షార్ట్ ఫిలిమ్స్ తీస్తే ఏదో రోజు సినిమా అవకాశం వస్తుందనే ఆశతో.. సొంత బంధువులు, స్నేహితులు దగ్గర అప్పులు చేసి షార్ట్ ఫిల్మ్ లు తీసాడు.

Read also:Supreme Court: రాజ్యసభ ఛైర్మన్‌కి క్షమాపణలు చెప్పండి.. ఆప్ ఎంపీకి సుప్రీంకోర్టు సూచన

అయితే ఆ షార్ట్ ఫిలిమ్స్ నుండి తనకు లాభం రాకపోగా నష్టాల పాలయ్యాడు. యువకుడి తల్లి సరస్వతీ మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్నారు. కాగా ఆమె జీతం డబ్బులు కూడా షార్ట్ ఫిలిమ్స్ తీసేందుకు వినియోగించాడు. ఈ క్రమంలో ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నాడు సునీల్. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్న సునీల్ ఆర్ధిక ఇబ్బందులు పెరగడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందిన కొడుకు మరణంతో సునీల్ తల్లి గుండెలవిసేలా విలపిస్తోంది. కాగా సునీల్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సునీల్ మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం కేంద్ర ఆసుపత్రికి తరలించారు