Rain Alert: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బంగాళాఖాతం నుంచి ఈస్టర్ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో గురువారం పలుచోట్ల వర్షం కురిసింది. దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 26వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తాయని, అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉదయం పూట పొగమంచుతో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
Read also: Vande Bharat: వందేభారత్ పై మరోసారి రాళ్ల దాడి..
Also Read
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- OTR : ధర్మవరంలో పోటీ టీడీపీ వర్సెస్ బీజేపీ అవుతుందా?
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
ఏపీలో ఓ మోస్తరు ఆవర్తనంతో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 25న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం మూసుకుంటోందని, దీని కారణంగా 26న అల్పపీడనం ఏర్పడి ఆ తర్వాత అది బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల జిల్లా కూచినపూడిలో 50.25, ఏలూరు జిల్లా నూజివీడులో 47.25, కృష్ణా జిల్లా భదేవరపల్లిలో 45.5, అన్నమయ్య జిల్లా వెలిగల్లులో 38 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వరి, పత్తికి స్వల్ప నష్టం వాటిల్లింది. వరి పైరు కోసి, ఓదెలపై ఉన్న పనులు, నూర్చి, ఆరబోసిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం కుప్పలు తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం కారణంగా దక్షిణ కోస్తా జిల్లాల్లోని పత్తి పొలాల్లో పండించిన పత్తి కూడా కొద్దిగా తడిసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి, పత్తి రైతులకు నష్టం కలిగిస్తుండగా.. ఇతర పంటలకు జీవం పోస్తోంది. గత వారం బంగాళాఖాతంలో తుపాను వచ్చినా రాష్ట్రంలో అంతగా ప్రభావం చూపలేదు. దీంతో వరి, పత్తి రైతులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
Telangana Election 2023: నవంబర్ 30 హాలీడే కాదు.. ఓటింగ్ డే..
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!