Site icon NTV Telugu

CPI Narayana: కేంద్రం కటాక్షం లేకపోతే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు పోకుండా ఉంటారా..?

Narayana

Narayana

CPI Narayana: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కటాక్షం లేకుంటే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు వెళ్లకుండా బయట ఉండటం సాధ్యం కాదన్నారు. వైఎస్ వివేక హత్యకేసులో ఎంక్వైరీ పూర్తయిందని సీబీఐ స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. జగన్‌కు మోడీ, అమిత్ షా రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల చేర్పులు, తొలగింపుల విషయంలో తమ పార్టీ గతంలో తిరుపతి ఎన్నికల్లో ఆధారాలు చూపించింది.. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా జాతీయస్థాయిలో దీన్ని నిరూపించారని సీపీ నారాయణ పేర్కొన్నారు.

Read Also: Perni Nani: పులివెందులలో పోలీసులు టీడీపీకి వంత పాడుతున్నారు..

అయితే, ఎన్నికల కమిషన్ తో పాటు స్వతంత్ర దర్యాప్తు సంస్థలు అన్ని మోడీ నియంత్రణలోకి వెళ్లిపోయాయని సీపీఐ నారాయణ విమర్శించారు. ట్రంప్ ఆర్థిక ఆంక్షల పేరుతో మోడీని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.. రష్యా నుంచి తక్కువ ధరలో క్రూడ్ ఆయిల్ తెచ్చి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక, శ్రీకాకుళం జిల్లాలోని పలాస వద్ద 1,400 ఎకరాల భూమిని పోర్టు కార్గోకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు.. 12వ తేదీన అక్కడే నిరసన చేస్తామని నారాయణ వెల్లడించారు.

Exit mobile version