గాల్లో పర్యటిస్తే తెలియదు.. వరదప్రాంతాల్లో తిరగాలి: జ్యోతుల నెహ్రూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాలో ప్రస్తుతం ప్రకృతి విపత్తు వలన అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఎక్కడ కనిపించడం లేదని ఆయన అన్నారు. గాల్లో పర్యటిస్తే.. ఎంత నష్టం వాటిల్లిందో తెలియదు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తే ఎంత నష్టం వాటిల్లిందో అప్పుడు తెలస్తుందని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. ఎంత నష్టంమైందో ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. డెల్టా ప్రాంతాల్లో కూడా నష్టం ఏర్పడింది. అధికారం కోసం వేల కిలోమీటర్లు తిరిగిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత ముంపు ప్రాంతాల్లో ఎందుకు పర్యటించడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ముంపు ప్రాంతాల్లో ఆలస్యంగా వెళ్ళిన వైసీపీ నాయకులపైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు జ్యోతుల నెహ్రూ. వ్యవసాయశాఖ మంత్రి వరి పంట వెయ్యవద్దు అనడం దారుణమన్నారు. కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారు. విద్యుత్ కొరత రాబోతుందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. దీనిని బట్టి పంటలు వేయొద్దని వ్యవసాయ శాఖ అంటుందన్నారు. వ్యవసాయశాఖ మంత్రికి అసలు ఆ శాఖ పైనా ఎలాంటి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు, వరద బాధితులకు వెంటనే జిల్లాల వారీగా నష్టపరిహారం అందించాలని జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- Tags
- flood areas
- Jyotula Nehru
- tdp
- ycp
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!