Mobile Number: ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్య ఫోన్‌కు కొత్త నంబర్ నుంచి ఫోన్ రావడంతో అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై పోలీసుల ముందు లొంగిపోయాడు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బ్రాహ్మణతాంగాళ్ పంచాయతీకి వెంకటేశ్ అలియాస్ పండు కై లాసనాథకోన అనే వ్యక్తి ఈశ్వరకాలనీకి చెందిన గాయత్రి(32)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Cinema At Manipur: మణిపూర్‌లో 23 ఏళ్ల తరువాత.. హిందీ సినిమా ప్రదర్శన
కాగా.. కొన్ని రోజుల క్రితం గాయత్రి చంద్రగిరిలో ఉంటున్న తన సోదరి రోజా ఇంటికి వెళ్లి వచ్చింది. అనంతరం రోజా ఒక కొత్త నంబర్ నుంచి తన అక్క గాయత్రికి ఫోన్ చేసి.. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది. అయితే.. గాయత్రి ఫోన్‌లో ఈ కొత్త నంబర్‌ని వెంకటేశ్ గమనించాడు. అతనికి అది రోజా నంబర్ అనే విషయం తెలీదు. దీంతో.. అతడు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మరెవరితోనో సన్నిహితంగా మెలుగుతోందని భావించాడు. ఆ అనుమానంతోనే గాయత్రిని వేధించడం మొదలుపెట్టాడు. రానురాను ఈ అనుమానం పెనుభూతంగా మారింది. దాంతో.. తన భార్యని అంతమొందించాలని వెంకటేశ్ నిర్ణయించుకున్నాడు.
Pawan Kalyan: మళ్లీ విశాఖకు పవన్‌కు.. నేడు ఎర్రమట్టి కొండల పరిశీలన
భర్త వేధింపులతో గాయత్రి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఇదే అదునుగా భావించి.. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో గాయత్రి నిద్రపోతున్నప్పుడు, వెంకటేశ్ ఆమె తలపై బండరాయితో గట్టిగా బాదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ నేరం చేసింది తనేనని పోలీసుల విచారణలో తేలిపోతుందని భావించి.. తానే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వెంకటేశ్ లొంగిపోయాడు. అతడిచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, గాయత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.