Homeguard Harassment: కీచక హోంగార్డ్.. పోలీస్ స్టేషన్లోనే వివాహితపై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Homeguard Sivananda Molested Married Woman In Anantapur Police Station: తమకు ఏదైనా సమస్య వస్తే.. ప్రజలు మొదటగా తట్టేది పోలీస్ స్టేషన్ తలుపులే. కానీ.. ఇప్పుడు ఆ స్టేషన్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తమని రక్షిస్తారన్న నమ్మకంతో ఆ రక్షక భటుల్ని ఆశ్రయిస్తే.. వాళ్లే భక్షకులుగా మారుతున్నారు. అందరూ కాదు కానీ, కొందరు పోలీసులు మాత్రం ఈ తరహా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఓ హోంగార్డ్ కూడా ఇలాంటి కీచక పనే చేశాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న భ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారం ఎక్కడికి దాకా వెళ్లిందంటే.. ఆ వివాహిత అవమానంగా భావించి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Minister Roja: సమ్మక్క- సారక్క రీ యూనియన్.. కన్నుల పండుగగా ఉందే
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్‌లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్‌కు.!
అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఒక వివాహిత తన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఓ పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పిన ఆమె.. మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. రాత్రైనా ఇంటికి రావడంతో.. కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. అయితే.. ఎక్కడా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో, ఈనెల 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని, పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కట్ చేస్తే.. ఈనెల 22వ తేదీన స్వయంగా ఆ వివాహితే తిరిగి వచ్చింది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. దీంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చేదాకా స్టేషన్లోనే ఉండమని పోలీసులు చెప్పారు. దీంతో ఆమె స్టేషన్లోనే కూర్చుంది.
Kakani Govardhan Reddy: చంద్రబాబు ఉంటే.. కరువు రాజ్యమేలుతుంది
మిగిలిన సిబ్బంది మొత్తం పని నిమిత్తం స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోగా.. హోంగార్డు శివానందా ఒక్కడే ఆ వివాహితతో పాటు స్టేషన్లో ఉన్నాడు. అప్పుడు అతడు మాటామాటా కలిపి, ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె పై అధికారులకు తెలియజేయగా.. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించి, వెంటనే అతడ్ని సస్పెండ్ చేశారు. అయితే.. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ వివాహిత అవమానంగా భావించింది. దీంతో.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు.. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్‌వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?