ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. .మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు…కానీ మొదటి రోజే క్యూ లైన్స్ లో భక్తులకు ఇక్కట్లు తప్పటం లేదు…గంటల తరబడి క్యూ లైన్స్ లో వున్నా భక్తులకు ఫ్యాన్స్ లేక త్రాగునీరు లేక అల్లాడుతున్నారు….ఇక ముసలి వాళ్లకు సైతం వాహనాలు లేకపోవటం గంటల తరబడి క్యులైన్స్లో పడిగాపులు గాయటంతో సరైన ఏర్పాట్లు చెయ్యలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా వుంటే..ఇంద్రకీలాద్రి పై క్యూలైన్లను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్లలో ప్రవేశించిన 30 నిమిషాల్లోనే భక్తులకు దర్శనం పూర్తవుతుంది. భక్తుల నుంచి వస్తున్న సూచనలను సైతం తీసుకుంటున్నాం అన్నారు. ఏర్పాట్ల పై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.. వీఐపీలకు కూడా దర్శనాలకు సంబంధించి ఏర్పాట్లు చేశాం.. దర్శనాలకు వచ్చే వీఐపీలు ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే ఉత్సవాలు విజయవంతం అవుతాయన్నారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు కలెక్టర్ ఢిల్లీ రావు.
Read Also: Ginna: జిన్నా వాయిదా.. ‘మా’ ప్రెసిడెంట్ గారు భయపడ్డారా..?
భవానిలా మాల ధారణ ,విరామాల సమస్యలపై కలెక్టర్ ను కలిశారు గురు భవానీలు. ఆరు రాష్ట్రాల్లో భవాని దీక్షలు నిర్వహిస్తున్నాం. 2 ఏళ్ల నుంచి హోమ గుండం ఏర్పాటు చేయడం లేదు…ప్రతి ఏటా లక్షలాది మంది భవాని భక్తులు మాల ధరించి మాల విరమణ కు దుర్గగుడి కి వస్తున్నారు. సీఎం జగన్ ,మంత్రి కొట్టు సత్యనారయణ భవానీల సమస్యపై వెంటనే స్పందించాలని గణేష్ గురుభవానీ కోరారు. భవానీల దీక్షను భగ్నం చేయవద్దన్నారు. దసరా ముగిసిన తరువాత మూడు రోజుల పాటు భవానీల కోసం హోమ గుండం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.
Read Also: Pawan Kalyan: ‘సన్నాఫ్ ఇండియా’ డైరెక్టర్ తో పవన్ సినిమా.. ?