Pawan Kalyan: ‘సన్నాఫ్ ఇండియా’ డైరెక్టర్ తో పవన్ సినిమా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: డైమండ్ రత్నంబాబు… రచయితగా ఈయన ఎంతోమందికి తెలుసు. ఎన్నో సినిమాలకు కథలు అందించి ఘనత ఆయనకు ఉంది. ఇక ఆయన రచయిత నుంచి డైరెక్టర్ గా మారిన విషయం విదితమే. ఆది సాయి కుమార్ తో బుర్ర కథ అనే సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత మంచు మోహన్ బాబు తో సన్నాఫ్ ఇండియా ని ఒక సినిమాను తెరకెక్కించాడు. అప్పట్లో ఈ సినిమా ప్రమోషన్స్ ఒక సంచలనం సృష్టించాయని చెప్పాలి. మోహన్ బాబు కెరీర్ లోనే ఇదో అద్భుతమైన కథ అని, డైమండ్ రత్నంబాబు.. ఇండస్ట్రీకి దొరికిన రత్నం అని చెప్పుకొచ్చారు. తీరా సినిమా చూసాకా అందరి మతులు చెడిపోయాయి. మోహన్ బాబు కెరీర్ లోనే ఈ సినిమాకు ఒక్క టికెట్ కొనుగోలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా డైమండ్ రత్నంబాబు ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. సన్నాఫ్ ఇండియా సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా తీసేవాడినని చెప్పుకొచ్చాడు.
“సన్నాఫ్ ఇండియా సినిమా మేకింగ్ చూసి బండ్ల గణేష్ ఎంతో మెచ్చుకున్నాడు. తనవద్ద పవన్ కు సూట్ అయ్యే కథ ఉందని చెప్పగానే చేద్దాం.. అని చెప్పాడు. ఆ సినిమాకు మెకానిక్ అని టైటిల్ కూడా అనుకున్నాను. ఒక మెకానిక్ సమాజంలో ఉన్న సమస్యలను ఎలా రిపేర్ చేశాడు అనేది కథ.. అయితే ఎప్పుడైతే ఈ సినిమా ప్లాప్ అని టాక్ వచ్చిందో అప్పటినుంచి ఫోన్ కూడా ఎత్తడంలేదు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకున్న తరువాత మా ఇంటి వాచ్ మెన్ కూడా నా మాట వినలేదు. ఇండస్ట్రీ తీరే అంతా విజయాలు ఉన్నంతసేపు భుజం తడతారు కానీ ఒక్కసారి డిజాస్టర్ టాక్ వచ్చిందంటే కనీసం ముఖం వైపు కూడా చూడరు” అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ డైరెక్టర్, బిగ్ బాస్ విన్నర్ సన్నీ, హీరో సప్తగిరిలతో కలిసి అన్ స్టాపబుల్ అనే సినిమా తీస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా డైమండ్ రత్నంబాబు తలరాతను మారుస్తుందేమో చూడాలి.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!