IMD Warning AP: బంగ్లాదేశ్- పశ్చిమ బెంగాల్ తీరాల మధ్యన ఏర్పడిన వాయుగుండం నిన్న (జూలై 25న) ఉదయం భూ ఉపరితలంలోకి ప్రవేశించింది. ఇది ప్రస్తుతం ఝార్ఖండ్ ప్రాంతంపై కేంద్రీకృతం అయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వాయుగుండం మరికొద్ది గంటల పాటు ఉత్తర భారతదేశంపై కొనసాగుతూ బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఇక, ఈ వాయుగుండం ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
Read Also: US: అమెరికాలో పాక్ ఉప ప్రధాని పర్యటన.. ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్‌పై కీలక ప్రకటన
అయితే, గంటకు 50 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దీని ప్రభావం కారణంగా పోర్ట్ అధికారులు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలనను కొనసాగిస్తున్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న నౌకలు, పడవలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు, వచ్చే వారం బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల వచ్చే వారం కూడా వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉంది. ప్రజలు అధికారుల సూచనలను పాటించాలి, తీరప్రాంతాల వారు అలర్టుగా ఉండాలని ఐఎండీ పేర్కొనింది.