Uppu Kappurambu: డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతున్న కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు
- ఓటీటీ రిలీజ్ కాబోతున్న కీర్తి సురేష్ ఉప్పుకప్పురంబు
- మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నా సుహాస్
- తెలుగుతో పాటు.. తమిళం మలయాళం కన్నడ భాషల్లో విడుదల
- దీంతో పాటు హిందీలో ఓ వెబ్ సిరీస్‌లోనూ కీర్తి నటించనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UppuKappurambu Directly on OTT Platform: ప్రస్తుత సమయంలో ఓటీటీకి బాగా ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. ఒకప్పుడు థియేటర్స్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో చిన్న సినిమాలు వైపు పట్టించుకోని ఆడియన్స్ ఓటీటీ వచ్చినప్పటినుంచి చిన్న సినిమాలకి కూడా బాగా డిమాండ్ పెరిగింది. దీంతో మేకర్స్ సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే స్టార్స్ నటించిన సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా చేరింది. కీర్తి సురేష్ లేటెస్ట్ గ నటిస్తోన్న కొత్త చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. భోళా శంకర్ చిత్రం తర్వాత తెలుగు తెరకు కాస్త గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ తాజాగా ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. ఈ సినిమా పేరు ‘ఉప్పు కప్పురంబు’. టైటిల్‌కు తగ్గట్లే ఈ సినిమా కథాంశం వెరైటీగా ఉండనుందని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే మేకర్స్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో కీర్తి సురేష్ పాల్గొంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
Also Read: Alanaati Ramachandrudu: ‘అలనాటి రామచంద్రుడు’ కూడా వచ్చేస్తున్నాడు
Also Read
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
కాగా ఈ సినిమాలో సుహాస్ కూడా మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. నిన్నిలా నిన్నిలా మూవీతో దర్శకుడిగా మారిన అనిల్ శశి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే మేకర్స ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగులో సినిమాలు తగ్గించిన కీర్తి సురేష్.. తమిళంలో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మొత్తం 3 సినిమాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ తేరీ రీమేక్‌గా తెరకెక్కుతోన్న బేబీ జాన్‌తో హిందీ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. దీంతో పాటు హిందీలో ఓ వెబ్ సిరీస్‌లోనూ కీర్తి నటించనుంది అని సమాచారం.
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!