ప్రకాశం జిల్లాలో విద్యార్ధినిపై హెడ్మాస్టర్ దాడి ఘటనపై విద్యాశాఖ సీరియస్ అయింది. కొనకనమిట్ల మండలం నాగంపల్లి యంపీయూపీ పాఠశాలలో విద్యార్థినిపై హెడ్ మాస్టార్ దాడి ఘటనపై ఎన్టీవీలో ప్రసారమైన కథనాలకు స్పందించిన విద్యా శాఖ అధికారులు..రెండు రోజుల క్రితం స్కూల్లో భారతి అనే 8వ తరగతి విద్యార్థిని చితకబాదారు హెడ్మాస్టర్ రామచంద్రరావు.. హెడ్మాస్టర్ దెబ్బలకు స్పృహ కోల్పోయింది విద్యార్థిని భారతి. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది గొట్లగట్టు లోని ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు.
విద్యార్థినిపై దాడికి పాల్పడిన ఘటనలో హెడ్ మాస్టర్ ను విధుల నుండి సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. హెడ్ మాస్టర్ ఘటనపై స్పందించి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన డీఈఓ విజయభాస్కర్.. పోలీస్ స్టేషన్ లో హెడ్ మాస్టర్ పై ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులోనే హెడ్మాస్టర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు గ్రామస్తులు.
Read ALso:Drunk UP man: ఇట్లుంటది మనతోటి.. తాగుబోతుని కాటేసి ప్రాణాలు కోల్పోయిన కింగ్ కోబ్రా
విద్యార్దుల తల్లిదండ్రులు, గ్రామస్తులు హెడ్మాస్టర్ చర్యపై ఆగ్రహంతో వున్నారు. పవిత్రమయిన వృత్తిలో వుండి మద్యం మత్తులో విద్యార్ధుల్ని హింసించడం దారుణం అన్నారు. ప్రధానోపాధ్యాయుడి పదవికి ఆయన అనర్హుడని అంటున్నారు. స్కూళ్ళో విద్యార్ధుల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నాడని, ఇప్పటివరకూ ముగ్గురు గాజులపల్లి విద్యార్ధులను హెడ్మాస్టర్ కొట్టాడని, ఆయనపై కఠిన చర్యలు చేపట్టాలంటున్నారు గ్రామస్తులు. ఆ హెడ్మాస్టర్ ని సస్పెండ్ చేస్తే కుదరదని, కఠిన చర్యలు చేపట్టాలంటున్నారు.
Read Also: Colombia: కొలంబియాలో ఘోర ప్రమాదం.. 20 మంది దుర్మరణం