Site icon NTV Telugu

Harirama Jogaiah: ఇలా చేస్తే ఐదేళ్లు పవన్‌ కల్యాణే సీఎంగా ఉంటారు..!

Harirama Jogaiah

Harirama Jogaiah

Harirama Jogaiah: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల హీట్‌ పెరిగిపోతోంది.. ఓ వైపు ఎన్నికల పొత్తులు, మరో వైపు లాభాలు, నష్టాలపై నేతలు ఫోకస్‌ పెట్టారు.. వైసీపీ సింగిల్‌గా ఎన్నికలకు వెళ్లడం ఫైనల్‌.. కానీ, మిగతా పార్టీల సంగతి ఇంకా తెలాల్సి ఉంది.. జనసేన-బీజేపీ కలిసి ఉంటాయా? లేక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? దీనిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. అయితే, మాజీ మంత్రి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అన్ని విషయాలు బాసటగా నిలుస్తూ వస్తున్న ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో జనసేన పోటీ చేసినా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.. గతం కంటే జనసేన బలం ఇప్పుడు పెరిగిందన్న ఆయన.. మూడు పార్టీలు (వైసీపీ, టీడీపీ, జనసేన) విడివిడిగా పోటీ చేస్తే.. పవన్ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న ఆయన.. సీఎం కావడమే కాదు.. ఐదేళ్లు పవనే సీఎంగా ఉంటారని అభిప్రాయపడ్డారు.

Read Also: KTR: దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్

ఇక, పవన్‌ కల్యాణ్‌ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలనుకుంటే బీజేపీని కలుపుకొని వెళ్లడం మంచిదన్నారు హరిరామ జోగయ్య.. బీజేపీతో కలిసివెళ్లడం వల్ల జనసేన పార్టీకి లాభమే తప్ప.. నష్టం ఏమీలేదన్నారు.. మరోవైపు.. జనసేన- టీడీపీ కలసి పోటీ చేస్తే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఓడించడం మరింత సులువు అవుతుందన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా.. పవన్ కల్యాణ్‌కు కలసి వస్తుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.. కాపులంతా అన్ని వర్గాలను కలుపుకొని పవన్ కల్యాణ్‌ కు 100శాతం సహకరించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.

Exit mobile version