NTV Telugu Site icon

YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్.. అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌..!

Jagan

Jagan

YS Jagan: కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను గుంటూరు జైలులో పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందన్నారు.. చంద్రబాబు వైఫల్యంతో వరదల వల్ల 60 మంది చనిపోయారని ఆరోపించారు.. అందుకోసమే ఎప్పుడో జరిగిన ఘటనపై టీడీపీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది.. అసభ్య పదజాలంతో దూషించినా.. నేను సంయమనం పాటించా.. కానీ, కొందరు కోపంతో రాళ్లువేసి ఉంటే వేయొచ్చు.. కానీ, ఇప్పుడు అరెస్ట్‌ అయినవారంతా.. ఆ రోజు ఘటనా ప్రదేశంలో లేనివారే అన్నారు జగన్..

Read Also: Minister Tummala: గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు..

చంద్రబాబు వరదల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు‌. అందుకే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు జగన్.. ఆ రోజు టిడిపి కార్యాలయంలో పీసీ పెట్టి.. అప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తిని తిట్టారు.. దీంతో వైసీపీ కార్యకర్తలు ధర్నాకు వచ్చారు. నేను చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అన్నారు.. అయితే, ఇప్పుడు పోలీసులే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.. చంద్రబాబు పాలన గాలికి వదిలేశాడు. తుఫాన్‌ వస్తుందని ముందే అలెర్ట్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి వరద వస్తుందని తెలుసు.. ఆరోజే సమీక్ష చేసి ఉంటే.. అధికారులను అప్రమత్తం చేసి ఉంటే.. చర్యలు తీసుకొనే అవకాశం ఉండేదన్నారు..

Read Also: TGVishwaPrasad : పారాలింపిక్స్‌లో అంధుల క్రికెట్‌ను చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలి

ఇక, ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై స్పందించిన జగన్‌.. నిందితులుగా ఉన్న వ్యక్తులు.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు.. చంద్రబాబు, లోకేష్ లతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయన్నారు.. అసలు రామ్మోహన్, చిన్నాలు ఎవరు..? అని ప్రశ్నించారు వైఎస్‌ జగన్‌.. ఈ సందర్భంగా మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఏం వ్యాఖ్యలో చేశారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Show comments