SRM University: ఎస్ఆర్ఎం వర్సిటీ విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. సర్కార్ సీరియస్..
- ఎస్ ఆర్ ఎమ్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన..
- ఫుడ్ పాయిజన్ తో 4 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థత..
- నాణ్యత లేని ఫుడ్ అంటూ ఆందోళనకు దిగిన విద్యార్థులు..
- ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRM University: ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. మంగళగిరి మండలం నీరుకొండలో ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫుడ్ పాయిజన్ తో కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నిన్నరాత్రి విద్యార్దులు యూనివర్సీటీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుని సరైన భోజనం కూడా పెట్టకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసారు. భోజనంలో పురుగులు వస్తున్నాయని, నిల్వ ఉంచిన గుడ్లు, కూరగాయలు వాడడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. భోజనం బాగోలేదని పలుసార్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్, ఆర్డీవో, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు మంగళగిరి తహశీల్దార్, డీఎస్పీని కమిటీగా నియమించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం..
Read Also: Colourful Snake: రంగురంగులుగా, అందంగా కనిపించే పాము.. దగ్గరికెళ్లారో డేంజరే..
Also Read
- Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
- Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
- Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
-
Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
-
CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!