NTV Telugu Site icon

MP Balashowry: జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి.. పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్

Balashouri

Balashouri

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు నుంచి భారీ ర్యాలీగా జనసేన కార్యాలయానికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.

PM Modi: గత పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం దేశ చరిత్రను నిర్లక్ష్యం చేశారు..

ఈ సందర్భంగా బాలశౌారి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. రాజకీయ పార్టీల కంటే అభివృద్ధి ముఖ్యమని.. ఐదేళ్లుగా అభివృద్ధి జరిగిందేమీ లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు అటుకెక్కాయని బాలశౌరి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఎన్నిసార్లు చెప్పినా అభివృద్ధిపై స్పందించడం లేదన్నారు. రాష్ట్రంను అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతోనే జనసేనతో కలిసి నడుస్తున్నానని వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు.

Minister Kakani: చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డి నాపై నిందలు వేశారు..

భవిష్యత్ లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని బాలశౌరి తెలిపారు. రాష్ట్ర అభివృధ్ధిలో తాను కీలక పాత్ర పోషించనున్నట్లు పేర్కొన్నారు. 2004లో వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుంచి పోటీ చేసి గెలిచానన్నారు. కాగా.. బాలశౌరి ఎక్కడినుంచి పోటీ చేస్తానన్నది సందిగ్థత నెలకొంది. బాలశౌరి ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన నేత కాగా.. గుంటూరు నుంచే పోటీ చేస్తాడని తన అనుచరులు చెబుతున్నారు. అయితే గుంటూరు ఎంపీ స్థానం టీడీపీకి సంబంధించినది కాగా.. అక్కడి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పోటీ నుంచి విరమించారు. ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని బాలశౌరికే కేటాయిస్తారని తన అనుచరులు చెబుతున్నారు. కాగా, అక్కడి నుంచి టీడీపీ పోటీ చేస్తుందా.. లేదంటే జనసేన పోటీ చేస్తుందా అనేది సందిగ్థత నెలకొంది. మరోవైపు.. బాలశౌరి మాత్రం అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే శిరోధార్యం అని అంటున్నారు.