Minister Nara Lokesh: జెండా పండుగ అంటే నాకో ఎమోషన్ అన్నారు మంత్రి నారా లోకేష్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు స్కూల్ రోజులు గుర్తుకొస్తాయన్నారు.. గెస్ట్ జెండా ఎగరేసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేవన్నారు.. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు… దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు నా స్కూల్ రోజులు గుర్తొస్తాయి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఒక హడావిడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ను డెకరేట్ చేసే వాళ్ళం. స్కూల్ లో పెట్టే కాంపిటీషన్స్ కోసం స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళం.. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి జెండా ఎగరేసినప్పుడు గూస్ బమ్స్ వచ్చేవి అని తన స్కూల్ డేస్ గురించి చెప్పుకొచ్చారు..
Read Also: Revanth Reddy: ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయి.. ప్రజలు పాలాభిషేకం చేస్తున్నారు!
ఇక, ప్రపంచంలో ఒకే ఒక్క పవర్ ఫుల్ వెపన్ ఉంది.. ఇతర ఏ వెపన్స్ చేయలేని పని ఆ వెపన్ చేస్తుంది.. ఆ వెపన్ పేరే అహింస అన్నారు మంత్రి లోకేష్.. అయితే, ఆ వెపన్ మనకు ఇచ్చిన గొప్ప వ్యక్తి గాంధీ. అహింస, సత్యం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాత్రంత్య్రం సాధించారని గుర్తుచేశారు.. అందరిలో దేశభక్తి ఉండాలని సూచించారు లోకేష్.. ఆపరేషన్ సిందూర్ తో మన పవర్ చూపించాం.. ఆపరేషన్ సిందూర్ లో మన రాష్ట్రానికి చెందిన జవాన్ మురళీనాయక్ మృతి చెందారు. ఆ కుటుంబాన్ని నేను కలిశాను. జై జవాన్.. జై కిసాన్ నినాదంతో ముందుకుసాగాలన్నారు.. మరోవైపు, గత ప్రభుత్వం పదిలక్షల కోట్లు అప్పుచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.. విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చాం. గత ప్రభుత్వంలో రంగుల పిచ్చి ఉండేది. ఇప్పుడు స్కూల్స్, విద్యార్దులకు ఇచ్చే బ్యాగులు, డ్రెస్సులు, పుస్తకాలలో ఎక్కడా పార్టీ రంగులు, నేతల ఫొటోలు లేకుండా చేశామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్..