Guntur New Mayor: గుంటూరు కొత్త మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర..
- గుంటూరు నూతన మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం..
- కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర..
- కోవెలమూడికి అనుకూలంగా 34 ఓట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur New Mayor: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా మేయర్ ఎన్నికల బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర.. 34 ఓట్లతో గెలుపొందరు.. కోవెలమూడి రవీంద్రకు అనుకూలంగా 34 ఓట్లు రాగా.. వైసీపీ తరపున పోటీకి దిగిన అచ్చాల వెంకట రెడ్డికి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి.. దీంతో.. గుంటూరు మేయర్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో.. మేయర్ గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు.. మేయర్ ఎన్నిక సందర్భంగా కార్పొరేషన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సిల్ లో మొత్తం 63 మందిలో 32 ఓట్లు సాధిస్తే మేయర్ పీఠం దక్కించుకోవచ్చు. కానీ, కూటమి అభ్యర్థిగా 34 ఓట్లు వచ్చాయి.. దీంతో టీడీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.. ఆ తర్వాత కోవెలమూడి రవీంద్రతో మేయర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు..
Read Also: Health Tips: రుచికి తీపిగా ఉన్నప్పటికీ.. మధుమేహ రోగులకు ఈ పండ్లు బెస్ట్ ఆప్షన్
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
గుంటూరు మేయర్ ఎన్నికపై కృష్ణా- గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రత్యేక సమావేశం ద్వారా జీఎంసీ కొత్త మేయర్ గా టీడీపీకి చెందిన కోవెలమూడి రవీంద్ర ఎన్నికవడం సంతోషంగా ఉంది అన్నారు.. టీడీపీలో మొదటినుంచి కష్టపడిన వ్యక్తి కోవెలమూడి.. అలాంటి వ్యక్తి మేయర్ అవకాశం పార్టీ ఇవ్వడం అందరికీ ఆనందంగా ఉందన్నారు.. టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కలిసికట్టుగా పనిచేశారని అభినందించారు ఆలపాటి రాజేంద్రప్రసాద్.. మరోవైపు.. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మేయర్ గా కోవెలమూడి రవీంద్ర గెలవడం ఆనందంగా ఉందన్నారు.. గత ఇరవై ఏళ్లుగా కోవెలమూడి పార్టీకోసం కష్టపడ్డారు. నిజమైన కార్యకర్తకు పదవి లభించింది. అభివృద్ధిలో ముందుకువెళ్లాలన్నదే మా లక్ష్యం. అందులో భాగంగానే ఈ మార్పు. ఎమ్మెల్యేలు, ఎంపీ, కార్పోరేటర్లు అందరం కలిసి గుంటూరు అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేస్తామని వెల్లడించారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!