గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా మేయర్ ఎన్నికల బరిలోకి దిగిన కోవెలమూడి రవీంద్ర.. 34 ఓట్లతో గెలుపొందరు.. కోవెలమూడి రవీంద్రకు అనుకూలంగా 34 ఓట్లు రాగా.. వైసీపీ తరపున పోటీకి దిగిన అచ్చాల వెంకట రెడ్డికి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి..
అరండల్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడికి ఏపీ హైకోర్టు చురకలు అంటించింది.