NTV Telugu Site icon

Pawan Kalyan: కాసేపట్లో పవన్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం..

Pawan Kalyan

Pawan Kalyan

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. అందుకోసం జనసేన అధ్యక్షుడు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. బడ్జెట్‌ పై అవగాహన.. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై డిప్యుటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.

Read Also: Linguswamy : రూ.700కోట్లతో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్న లింగుస్వామి

కాగా.. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ ఉంటుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై బీఏసీ లో చర్చిస్తారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు. హజారు కావాలని వైసీపీ నిర్ణయించింది. జగన్ తమ సభ్యులతో కలిసి సభకు వస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా సభకు వస్తారా లేక ఒక్క రోజుకే పరిమితమా అనేది స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ ప్రతి రోజు సమావేశాలకు హాజరైతే మాత్రం సభ వాడిగా వేడిగా జరగనుంది.

Read Also: Ram Mohan Naidu: ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. ఆయన ఆశయాలు కొనసాగిస్తాం

ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు.. 8 నెలల పాలనపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సభకు వివరించనున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ క్రమంలో.. అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుత వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో స్పీకర్ సమీక్ష నిర్వహించారు.