NTV Telugu Site icon

Ambati Rambabu: గతంలో జగన్ చేసిన కృషి వల్లే పోలవరానికి నిధులు..

Ambati Rambabu

Ambati Rambabu

ఈ రోజు కేంద్రం నుండి విడుదలైన రూ.12 వేల కోట్లు గతంలో వైఎస్ జగన్ చేసిన కృషి వల్లే వచ్చాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అసత్యాలను చెప్తున్నారన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని.. అందుకే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. 2024లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత విదేశీ నిపుణులు వచ్చి పరిశీలించారని.. వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాజెక్ట్ లో అన్ని కట్టడాలు ఒక్కసారే కట్టడం వల్లే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది… ఇది నిపుణులు చెప్పిన మాట అని అంబటి రాంబాబు తెలిపారు. నది డైవర్షన్ పూర్తి కాకుండా.. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాంలు వేయకూడదని చెప్పారన్నారు. అలాంటి తప్పే గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు.

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ సూపర్‌హిట్ పథకం..115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు

చంద్రబాబు తొందర పాటుతో పోలవరాన్ని ఆరేళ్ళు వెనక్కు నెట్టారని అంబటి రాంబాబు తెలిపారు. చేసిందంతా చేసి చంద్రబాబు ఇప్పుడు మీడియా ముందు ఆవేశపడుతున్నాడని పేర్కొన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ వేగం పెరిగిందని అంబటి రాంబాబు చెప్పారు. 2016లో కమీషన్ల కోసం కక్కుర్తి పడి పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చంద్రబాబు ఒప్పుకున్నాడన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరంకు ఏమి చేయలేదని చెప్పడం దుర్మార్గమని దుయ్యబట్టారు. 13, 14 సంవత్సరాలలో ఉన్న రేట్లకు పూర్తి చేస్తాం అని.. 2016లో కేంద్రం దగ్గర ఒప్పుకుని వచ్చారని తెలిపారు. రూ. 20,398 కోట్లకు నిర్మాణం చేస్తామని చంద్రబాబు ఒప్పుకున్నాడని.. రూ.4,000 కోట్లు పైగా అప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేశారన్నారు. మరోవైపు.. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రజలకు మేలు చేయాలని జగన్ ప్రయత్నించారని అంబటి రాంబాబు తెలిపారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులలో రూ. 2400 కోట్లు ప్రభుత్వానికి లబ్ధి చేకూరిందని చెప్పారు. మిగిలిన ప్రాజెక్ట్ లలో కూడా వేల కోట్ల ప్రభుత్వ ధనం మిగిల్చామన్నారు. జగన్ చేసిన మంచి పనులను కూడా బూచిగా చూపిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.

Delhi: రెస్టారెంట్‌లో దారుణం.. ఫుడ్ ఆర్డర్‌పై ఘర్షణ.. కస్టమర్‌ హత్య

పార్టీ మార్పులపై అంబటి రాంబాబు స్పందించారు. ప్రస్తుత రాజకీయాలలో విలువలు తగ్గాయి అనుకుంటున్నా.. మోపిదేవి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో కూడా పని చేసిన వ్యక్తి అని అన్నారు. అలాగే.. వైఎస్ జగన్ క్యాబినెట్ లో కూడా పని చేశారని తెలిపారు. తాను గెలిచినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని.. కానీ, 2019 ఎన్నికల్లో ఓడిపోయినా మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చారని అంబటి పేర్కొన్నారు. మోపిదేవి పార్టీ నుండి వెళ్తారని అనుకోవడం లేదు.. ఏదైనా బాధ కలిగినా వెనక్కు రమ్మని కోరుతున్నట్లు చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. ఎవరు పార్టీలు మారి చంద్రబాబుతో వెళ్తే.. కాల గర్భంలో కలసి పోవడమేనని విమర్శించారు. త్వరలోనే జిల్లా కమిటీలు వేస్తామని అంబటి రాంబాబు చెప్పారు.