Site icon NTV Telugu

Ambati Rambabu bail: అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మాజీ మంత్రికి మరో కేసులోనూ బెయిల్

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu bail: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులోనూ కోర్టు నుంచి ఊరట లభించింది. గుంటూరు స్పెషల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ర్యాలీగా వస్తున్న సమయంలో పట్టాభిపురం పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో అంబటిపై కేసు నమోదు చేశారు.

Read Also: Deepali Ghosh: హ్యాట్సాఫ్ బామ్మ.. నెటిజన్ల మనసు గెలుచుకున్న 70 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్

ఇదిలా ఉండగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే మరో కేసులో అంబటి రాంబాబు రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్‌పై ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. గుంటూరు స్పెషల్ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను మళ్లీ రాజమండ్రి జైలుకు తరలించారు. అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు పట్టాభిపురం పోలీసుల కస్టడీ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, చివరికి బెయిల్ మంజూరు చేసింది. రూ.10,000 పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంతో అంబటి రాంబాబుకు తాత్కాలికంగా పెద్ద ఊరట లభించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వైపు, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో అంబటి రాంబాబకు బెయిల్‌ వచ్చిన విషయం విదితమే.

Exit mobile version