SRM University: గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం కాలేజీ హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో సుమారు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సెలవులు ప్రకటించారు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రెండు వారాలపాటు సెలవులు పేర్కొన్నారు ఎస్ఆర్ఎం యూనివర్శిటీ రిజిస్ట్రార్.. అయితే, యూనివర్సిటీలో మొత్తం శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ నిర్ణయంతో ఇప్పటికే విద్యార్థులు హాస్టల్లు ఖాళీ చేసి తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. కాగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది.. చివరకు ప్రభుత్వం స్పందించి గుంటూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు.. వెంటనే నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే..
Read Also: Anam Ramnarayana Reddy: వైఎస్ జగన్పై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు.. ఉనికి కోల్పోతానన్న భయంతోనే..!