Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: తన ఇల్లు, ఆఫీసుపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి కేసులో విచారణ అధికారిని మార్చాలని, నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ టార్చర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రెండు ఫిర్యాదులు చేశారు. టీడీపీ నాయకుల దాడికి పోలీసులు పూర్తిగా సహకరించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని తాను ఫిర్యాదు చేసే వరకూ కేసు నమోదు చెయ్యలేదన్నారు. ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లతో కేసు నమోదు చేసినా జైలులు పంపి తన ఇంటిపై దాడి చేసినవారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారన్నారు. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు నా కేసు వ్యవహారంలో దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తేల్చిచెప్పారు.
ప్రధాన ఆరోపణలు:
జనవరి 31న తన ఇల్లు, కార్యాలయంపై సుమారు 7 గంటల పాటు దాడి జరిగిందని ఆరోపణ
దాడి తర్వాత తనను అరెస్ట్ చేసి 18 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్లు వెల్లడి
పోలీసులు స్వయంగా (సుమోటోగా) కేసు నమోదు చేయలేదని విమర్శ
ఫిర్యాదు చేసిన తర్వాతే కేసు నమోదు చేశారని ఆరోపణ
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
పోలీసులపై ఆరోపణలు:
దాడి చేసినవారిపై తేలికపాటి (బెయిలబుల్) కేసులు మాత్రమే నమోదు చేశారు
నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు
తనపై మాత్రం అదే సెక్షన్లతో కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు
పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఈ కేసులో అన్యాయంగా వ్యవహరించారని ఆరోపణ..
కీలక డిమాండ్లు:
దాడి, హత్యాయత్నం, ఆస్తి నష్టం కేసులు నమోదు చేయాలి
సిట్ (SIT) ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలి
నల్లపాడు పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకోవాలి
కస్టోడియల్ టార్చర్‌పై విచారణ జరపాలి
ఈ ఘటన వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఉన్నారని ఆయన ఆరోపించిన అంబటి రాంబాబు.. అలాగే టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని కూడా విమర్శించారు. తనపై నమోదైన కేసులు, అరెస్ట్ విధానంపై ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!