Site icon NTV Telugu

మౌలిక వసతుల కల్పన.. దిగజారిన తెలుగు రాష్ట్రాలు

మౌలిక వసతుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ర్యాంకులు దిగజారాయి.. గతంలో ఉన్న ర్యాంకులు నిలబెట్టుకోకపోగా.. రెండు రాష్ట్రాలు తమ ర్యాంకులను కోల్పోయి.. కిందికి దిగజారాయి.. రాష్ట్రాల “లాజిస్టిక్స్ ప్రొఫైల్స్‌”ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విడుదల చేశారు.. ఈ సారి గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి.. అయితే, 2019లో మూడో ర్యాంక్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2021 నాటికి తొమ్మిదో ర్యాంక్‌కు దిగజారిపోయింది.. అలాగే, తెలంగాణ 2019లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా, 2021 నాటికి 10 ర్యాంక్‌కు పడిపోయింది..

రాష్ట్రాల లాజిస్టిక్స్ ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ 2019లో 3.42 స్కోర్‌తో మూడో ర్యాంక్‌లో ఉండగా, 2021 నాటికి 3.17 స్కోర్‌తో తొమ్మిదో ర్యాంక్‌కు దిగజారింది. రోడ్ల నాణ్యత (3.59 స్కోర్‌), రైల్వే మౌలిక వసతులు నాణ్యత (3.26 స్కోర్‌), మల్టీ మోడల్‌ టెర్మినల్‌ నాణ్యత (3.38 స్కోర్‌), గిడ్డంగులు నాణ్యత (3.27 స్కోర్‌), యూనిమోడల్ టెర్మినల్ నాణ్యత (2.92 స్కోర్‌), లాజిస్టిక్‌ సర్వీస్‌ నాణ్యత (3.55 స్కోర్‌), లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ల సామర్ధ్యం (3.50 స్కోర్‌), రోడ్డు సరుకు రవాణా ధరల సహేతుకత (2.35 స్కోర్‌), టెర్మినల్‌ సర్వీస్‌ ధరల సహేతుకత (2.47 స్కోర్‌), కార్గో డెలివరీ రవాణా (3.48 స్కోర్‌), మోబైల్‌, ఇంటర్‌ నెట్‌ సర్వీస్‌ (3.60 స్కోర్‌), రవాణా సమయంలో సురక్షితం, భద్రత (3.61 స్కోర్‌), టెర్మినల్‌లో సురక్షితం, భద్రత (3.78 స్కోర్‌) తదితర అంశాల్లో ఏపీ నిలిచింది..

ఇక, తెలంగాణ 2019లో 3.22 స్కోర్‌తో ఎనిమిదో ర్యాంక్‌ను సాధించింది.. 2021లో 3.14 స్కోర్‌తో పదో ర్యాంక్‌కు పడిపోయింది.. రోడ్ల నాణ్యత (3.48 స్కోర్‌), రైల్వే మౌలిక వసతులు నాణ్యత (3.14 స్కోర్‌), మల్టీ మోడల్‌ టెర్మినల్‌ నాణ్యత (3.47 స్కోర్‌), గిడ్డంగులు నాణ్యత (2.94 స్కోర్‌), యూనిమోడల్ టెర్మినల్ నాణ్యత (3.21స్కోర్‌), లాజిస్టిక్‌ సర్వీస్‌ నాణ్యత (3.52 స్కోర్‌), లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ల సామర్ధ్యం (3.56స్కోర్‌), రోడ్డు సరుకు రవాణా ధరల సహేతుకత (2.31 స్కోర్‌), టెర్మినల్‌ సర్వీస్‌ ధరల సహేతుకత (2.41 స్కోర్‌), కార్గో డెలివరీ రవాణా (3.67 స్కోర్‌), మోబైల్‌, ఇంటర్‌ నెట్‌ సర్వీస్‌ (3.66 స్కోర్‌), రవాణా సమయంలో సురక్షితం, భద్రత (3.82స్కోర్‌), టెర్మినల్‌లో సురక్షితం, భద్రత (3.92స్కోర్‌) తదితర అంశాల్లో తెలంగాణ నిలిచింది. ఈ ఏడాది మాత్రం గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌ మొదటి మూడు స్థానాలు నిలిచాయి.

Exit mobile version