మౌలిక వసతుల కల్పన.. దిగజారిన తెలుగు రాష్ట్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మౌలిక వసతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ర్యాంకులు దిగజారాయి.. గతంలో ఉన్న ర్యాంకులు నిలబెట్టుకోకపోగా.. రెండు రాష్ట్రాలు తమ ర్యాంకులను కోల్పోయి.. కిందికి దిగజారాయి.. రాష్ట్రాల “లాజిస్టిక్స్ ప్రొఫైల్స్”ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విడుదల చేశారు.. ఈ సారి గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి.. అయితే, 2019లో మూడో ర్యాంక్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021 నాటికి తొమ్మిదో ర్యాంక్‌కు దిగజారిపోయింది.. అలాగే, తెలంగాణ 2019లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా, 2021 నాటికి 10 ర్యాంక్‌కు పడిపోయింది..
రాష్ట్రాల లాజిస్టిక్స్ ప్రొఫైల్స్‌ను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ 2019లో 3.42 స్కోర్‌తో మూడో ర్యాంక్‌లో ఉండగా, 2021 నాటికి 3.17 స్కోర్‌తో తొమ్మిదో ర్యాంక్‌కు దిగజారింది. రోడ్ల నాణ్యత (3.59 స్కోర్), రైల్వే మౌలిక వసతులు నాణ్యత (3.26 స్కోర్), మల్టీ మోడల్ టెర్మినల్ నాణ్యత (3.38 స్కోర్), గిడ్డంగులు నాణ్యత (3.27 స్కోర్), యూనిమోడల్ టెర్మినల్ నాణ్యత (2.92 స్కోర్), లాజిస్టిక్ సర్వీస్ నాణ్యత (3.55 స్కోర్), లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ల సామర్ధ్యం (3.50 స్కోర్), రోడ్డు సరుకు రవాణా ధరల సహేతుకత (2.35 స్కోర్), టెర్మినల్ సర్వీస్ ధరల సహేతుకత (2.47 స్కోర్), కార్గో డెలివరీ రవాణా (3.48 స్కోర్), మోబైల్, ఇంటర్ నెట్ సర్వీస్ (3.60 స్కోర్), రవాణా సమయంలో సురక్షితం, భద్రత (3.61 స్కోర్), టెర్మినల్‌లో సురక్షితం, భద్రత (3.78 స్కోర్) తదితర అంశాల్లో ఏపీ నిలిచింది..
Also Read
ఇక, తెలంగాణ 2019లో 3.22 స్కోర్‌తో ఎనిమిదో ర్యాంక్‌ను సాధించింది.. 2021లో 3.14 స్కోర్‌తో పదో ర్యాంక్‌కు పడిపోయింది.. రోడ్ల నాణ్యత (3.48 స్కోర్), రైల్వే మౌలిక వసతులు నాణ్యత (3.14 స్కోర్), మల్టీ మోడల్ టెర్మినల్ నాణ్యత (3.47 స్కోర్), గిడ్డంగులు నాణ్యత (2.94 స్కోర్), యూనిమోడల్ టెర్మినల్ నాణ్యత (3.21స్కోర్), లాజిస్టిక్ సర్వీస్ నాణ్యత (3.52 స్కోర్), లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ల సామర్ధ్యం (3.56స్కోర్), రోడ్డు సరుకు రవాణా ధరల సహేతుకత (2.31 స్కోర్), టెర్మినల్ సర్వీస్ ధరల సహేతుకత (2.41 స్కోర్), కార్గో డెలివరీ రవాణా (3.67 స్కోర్), మోబైల్, ఇంటర్ నెట్ సర్వీస్ (3.66 స్కోర్), రవాణా సమయంలో సురక్షితం, భద్రత (3.82స్కోర్), టెర్మినల్‌లో సురక్షితం, భద్రత (3.92స్కోర్) తదితర అంశాల్లో తెలంగాణ నిలిచింది. ఈ ఏడాది మాత్రం గుజరాత్, హర్యానా, పంజాబ్ మొదటి మూడు స్థానాలు నిలిచాయి.
తాజావార్తలు
-
Mahela Jayawardene: 13 మ్యాచ్‌ల్లో కేవలం 4 వికెట్లే.. బుమ్రా ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం బయటపెట్టిన ముంబై కోచ్..
-
Toxic: యష్ ఇచ్చిన హింట్‌తో సోషల్ మీడియాలో రచ్చ.. హీరోయిన్ల పాత్రలు ఇదేనా?
-
E100 Flex-Fuel Car: పెట్రోల్ ఖర్చుకు గుడ్‌బై చెప్పే రోజులు దగ్గర్లోనే.. E100 ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును తీసుకొస్తున్న మారుతి
-
Ram Charan : స్టార్ క్రికెటర్ బుమ్రాకు సారీ చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
-
US-Iran agreement: “చివరి దశలో అమెరికా-ఇరాన్ డీల్”.. ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?