NTV Telugu Site icon

Gudivada Amarnath: రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు..

Amarnath

Amarnath

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ వివాదంలో చంద్రబాబు తప్పు దొరికిపోయింది కనుకే రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలకు ఆద్యుడైన చంద్రబాబు.. ఇప్పుడు మత రాజకీయాలకు పునాదులు వేసి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోవడానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వాలి.. టీడీపీ మద్దతుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించుకుంటామని ప్రకటించాలని అన్నారు.

Heart disease: స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ గుండె జబ్బులు..ఎందుకు..?

తిరుపతి, తిరుమల పవిత్ర మీద రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ పాటిదో ఎక్సయిజ్ షాపులు కేటాయింపు చూస్తే అర్ధం అవుతుందని విమర్శించారు. ఒక్క తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264 షాపులు ఇచ్చారని అమర్నాథ్ పేర్కొన్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం అయ్యింది.. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యోగుల బదిలీలపై ఉన్న ఫోకస్ పేదవాడి కష్టాల మీద లేదని దుయ్యబట్టారు. తిరుపతి లడ్డు వివాదంపై సీబీఐ విచారణ చేయాల్సిందేనని అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో హామీలు అమలులో ప్రభుత్వం వైఫల్యం అయినందుకే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. లడ్డుపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రే దానిని నిరూపించేందుకు చొరవ తీసుకోవాలని తెలిపారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. మూల నక్షత్ర సమయంలో సీఎం దర్శనం

రాష్ట్రంలో సినిమా పోలీసింగ్ నడుస్తోంది.. ప్రభుత్వం చెప్పిన మాట తప్ప లా & ఆర్డర్ వైఫల్యం జరిగిందని చెప్పిన పట్టించుకునే పరిస్థితి లేదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. సిట్ చీఫ్, ఆయన ఆధీనంలో జరిగే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని తెలిపారు. పల్నాడులో లా& ఆర్దర్ మెయింటేన్ చేయడంలో ఐజీగా ఏ విధంగా సిట్ చీఫ్ వ్యవహరించారో అందరికీ తెలుసని చెప్పారు. ప్రభుత్వాలు వేసిన సిట్‌లు ఎలా పనిచేస్తాయో తమకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం లేకనే సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. కల్తీ నెయ్యి వాడారు కానీ.. ఎక్కడో తెలియదని సీఎం చెప్పడంలో అంతర్యం దాగి ఉందని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.