NTV Telugu Site icon

Gudivada Amarnath: జనసేనాకు పదేళ్లుగా అజెండా లేదు.. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు

Gudivada On Pawan

Gudivada On Pawan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాటల దాడిని ఉద్ధృతం చేశారు వైసీపీ నేతలు. పవన్ మచిలీపట్నం సభపై కౌంటర్లు ఇస్తున్నారు. మచిలీపట్నం సభలో మాట్లాడిన పవన్ వచ్చే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని, తాము ప్రయోగాలు చేయబోమని స్పష్టంచేశారు. శాసనసభలో అడుగుపెట్టేలాగే తమ ప్రణాళిక ఉంటుందని తెలిపారు. తన సహా పోటీ చేసే అభ్యర్థులంతా గెలిచే తీరాలన్నారు. తమ దగ్గర డబ్బుల్లేవు అని, మేం డబ్బులు పంచలేం. మీ ఓటు మీరే కొనుక్కుని మాకు ఓటేయండి అంటూ సభకు హాజరైన పార్టీ శ్రేణులు, మద్దతుదారులను ఉద్దేశించి ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనది బలమైన సంతకం ఉంటుందన్న పవన్… రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని చెప్పారు. ఈ క్రమంలో పవన్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. మాటల దాడికి పదను పెట్టారు.
Also Read: CM Jagan: ఏపీ సోషియో ఎకనామిక్‌ సర్వే విడుదల

తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్.. పవన్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ, పదేళ్ళ పాటు ఒక అజెండా లేకుండా నడిచిన పార్టీ జనసేన అని వ్యాఖ్యానించారు. రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ జనసేన అని కామెంట్ చేశారు.తమ పార్టీ ఏం చేస్తుందో చెప్పకుండా గంటన్నర పవన్ మాట్లాడరని అన్నారు. పవన్ సభకు వచ్చిన కార్యకర్తలు చాలా అమయాకులు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ బంకర్ టు బందర్ అంటూ మండిపడ్డారు. నెలన్నర రోజుల పాటు బంకర్ లో దాక్కున్నాడని ఆరోపించారు.

జెండా పవన్ ది అజెండా చంద్రబాబుదని ఆరోపించారు. పవన్ ప్రసంగం సారాంశం కాపు ఓట్లను చంద్రబాబుకు ఎలా ధారాదత్తం చేయలన్నదే అని చెప్పారు. అసెంబ్లీకి రావాలని ఉంటే ఎన్నికల వరకు ఆగటం ఎందుకు? అప్రశ్నించారు. కావాలంటే స్పీకర్ ని అడిగి రెండు పాస్ లు ఇస్తామని, వచ్చి అసెంబ్లీ చూసి వెళ్ళొచ్చు సెటైర్లు వేశారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని ఇక్కడ లేదంటున్నారని, మరి అక్కడే పోటీ చేయవచ్చు కదా అని సూటిగా ప్రశ్నించారు. ఉద్దేశంతో నిన్న సభ పెట్టారో పవన్‌కే తెలీదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ కు 175కు 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదన్నారు. నీది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన అంటూ ఫైర్ అయ్యారు.
Also Read:Perni Nani: తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే.. అర్థరాత్రి మద్దెల దరువు