Gudivada Amarnath: పవన్, చంద్రబాబు భేటీపై సెటైర్.. సంక్రాంతి మామూళ్ల కోసమట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Ambati Rambabu Counters On Chandrababu Pawan Kalyan Meeting: హైదరాబాద్‌లో జనసేన అధిపతి పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు అయిన భేటీ అయిన సంగతి తెలిసిందే! కుప్పం ఘటనపై చంద్రబాబుని పరామర్శించేందుకు పవన్ ఆయన ఇంటికి వెళ్లారు. ఇదే సమయంలో వీళ్లిద్దరు జీవో నం.1పై కూడా చర్చించనున్నట్టు తెలిసింది. అయితే.. వీరి భేటీపై వైసీపీ నాయకుల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్విటర్ మాధ్యమంగా వీరి భేటీపై స్పందిస్తూ.. సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్తతండ్రి చంద్రబాబుకి వద్దకు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వెళ్లాడంటూ సెటైర్స్ వేశారు. అలాగే.. మంత్రి అంబటి రాంబాబు సైతం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సంక్రాంతికి అందరి ఇంటికి గంగిరెద్దలు వెళ్తాయని.. ఇక్కడ చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ బసవన్నలా తల ఊపడానికి వెళ్లాడని చురకలంటించారు.
Malladi Vishnu: పవన్, చంద్రబాబు భేటీపై కౌంటర్.. ఇదొక అపవిత్ర కలయిక
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
- Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
- Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
మంత్రి కారుమూరి కూడా పవన్, బాబుల భేటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు, పవన్‌ల కలయిక కొత్తేమీ కాదని.. ఇద్దరూ ఎప్పటినుంచో కలిసే ఉన్నారని అన్నారు. రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి వీళ్లకు అవసరం లేదని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి వీళ్ళకి ముఖ్యమన్నారు. పేద ప్రజల ప్రాణాలు కంటే, చంద్రబాబుబే పవన్‌కు ముఖ్యమన్నారు. పుష్కరాల్లో 30 మంది చనిపోతే పవన్ మాట్లాడలేదని, ఇప్పుడు 11 మంది చనిపోతే నోరెత్తలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కలిసి ఏపీపై కుట్ర చేస్తున్నారన్నారు. అంతకుముందు మల్లాది విష్ణు సైతం చంద్రబాబు, పవన్‌లది అపవిత్ర కలయిక అని వ్యాఖ్యానించారు. తాజా భేటీతో పవన్, చంద్రబాబుల ముసుగు పూర్తిగా తొలగిపోయిందని.. వీరి భేటీతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. పవన్‌కు ఒక స్టాండ్ లేదని.. ప్యాకేజీకి లొంగిపోయాడు కాబట్టే చంద్రబాబు ఇంటికి వెళ్లాడని అభిప్రాయపడ్డారు.
Himachal Pradesh Cabinet: హిమాచల్ కేబినెట్ విస్తరణ.. విక్రమాదిత్య సింగ్ సహా 7గురు ప్రమాణం
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!