Site icon NTV Telugu

Gudivada Amarnath: పవన్, చంద్రబాబు భేటీపై సెటైర్.. సంక్రాంతి మామూళ్ల కోసమట!

Ambati Gudivada On Pk Babu

Ambati Gudivada On Pk Babu

Gudivada Amarnath Ambati Rambabu Counters On Chandrababu Pawan Kalyan Meeting: హైదరాబాద్‌లో జనసేన అధిపతి పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు అయిన భేటీ అయిన సంగతి తెలిసిందే! కుప్పం ఘటనపై చంద్రబాబుని పరామర్శించేందుకు పవన్ ఆయన ఇంటికి వెళ్లారు. ఇదే సమయంలో వీళ్లిద్దరు జీవో నం.1పై కూడా చర్చించనున్నట్టు తెలిసింది. అయితే.. వీరి భేటీపై వైసీపీ నాయకుల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్విటర్ మాధ్యమంగా వీరి భేటీపై స్పందిస్తూ.. సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్తతండ్రి చంద్రబాబుకి వద్దకు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వెళ్లాడంటూ సెటైర్స్ వేశారు. అలాగే.. మంత్రి అంబటి రాంబాబు సైతం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సంక్రాంతికి అందరి ఇంటికి గంగిరెద్దలు వెళ్తాయని.. ఇక్కడ చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ బసవన్నలా తల ఊపడానికి వెళ్లాడని చురకలంటించారు.

Malladi Vishnu: పవన్, చంద్రబాబు భేటీపై కౌంటర్.. ఇదొక అపవిత్ర కలయిక

మంత్రి కారుమూరి కూడా పవన్, బాబుల భేటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు, పవన్‌ల కలయిక కొత్తేమీ కాదని.. ఇద్దరూ ఎప్పటినుంచో కలిసే ఉన్నారని అన్నారు. రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి వీళ్లకు అవసరం లేదని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి వీళ్ళకి ముఖ్యమన్నారు. పేద ప్రజల ప్రాణాలు కంటే, చంద్రబాబుబే పవన్‌కు ముఖ్యమన్నారు. పుష్కరాల్లో 30 మంది చనిపోతే పవన్ మాట్లాడలేదని, ఇప్పుడు 11 మంది చనిపోతే నోరెత్తలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కలిసి ఏపీపై కుట్ర చేస్తున్నారన్నారు. అంతకుముందు మల్లాది విష్ణు సైతం చంద్రబాబు, పవన్‌లది అపవిత్ర కలయిక అని వ్యాఖ్యానించారు. తాజా భేటీతో పవన్, చంద్రబాబుల ముసుగు పూర్తిగా తొలగిపోయిందని.. వీరి భేటీతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. పవన్‌కు ఒక స్టాండ్ లేదని.. ప్యాకేజీకి లొంగిపోయాడు కాబట్టే చంద్రబాబు ఇంటికి వెళ్లాడని అభిప్రాయపడ్డారు.

Himachal Pradesh Cabinet: హిమాచల్‌ కేబినెట్‌ విస్తరణ.. విక్రమాదిత్య సింగ్ సహా 7గురు ప్రమాణం

Exit mobile version