Anantapur: శెట్టూరులో విషాదం.. సిలిండర్ పేలి నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం, ములకలేడు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రును చికిత్సనిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు.
ఇవాళ (శనివారం) వేకువజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైనున్న మిద్దె కప్పు కూలి.. నిద్రిస్తున్న వారిపై పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు, అధికారులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
Also Read
- YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
- Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
- Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
శిథిలాలను తొలగించి చూడగా.. అప్పటికే నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో కనిపించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన జైనుబి(60), దాదు(35), షర్ఫున(30), ఫిర్దోజ్(6) గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..