Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ganja Farmers Follows New Trend

వాటెన్ ఐడియా.. గంజాయి సాగులో నయా ట్రెండ్!

Published Date :October 22, 2021 , 3:40 pm
By NTV WebDesk
వాటెన్ ఐడియా.. గంజాయి సాగులో నయా ట్రెండ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి గమ్మత్తుగా చిత్తు చేస్తోంది. రాజకీయాల్లో మాటల మంటలకు అదే కారణం అని చెప్పకతప్పదు. గుజరాత్‌లో దొరికిన మత్తు పదార్ధాల దగ్గర్నించి.. నిత్యం విశాఖ, ఏవోబీలో పట్టుబడే గంజాయి వరకూ అంతా రాజకీయ నేతల మధ్య వాగ్వాదానికి కారణం అవుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. గంజాయిని సాగుచేసే రైతులు అనుసరిస్తున్న విధానాలు ఔరా అనిపించకమానవు.

ఇటీవల కాలంలో గంజాయి రవాణాపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాపారులు కొత్త విధానాలు అవలంభిస్తున్నారు… ఇంతవరకు వ్యాపారస్తులే నేరుగా ఏజెన్సీకి వచ్చి కొనుగోలు చేసేవారు. ఈ క్రమంలో దాడులు జరిగితే నేరుగా వారిపై కేసులు నమోదవుతున్నాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు కొత్త విధానాలను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం గంజాయిని సాగుచేసే రైతులే నేరుగా వ్యాపారులు చెప్పిన చోటుకు అప్పజెప్పేవిధంగా ఒప్పందం చేసుకుంటున్నారు.

తాజాగా జరిగిన ఉదంతమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. గురువారం నర్సీపట్నం మండలం, గబ్బాడ వంతెన వద్ద పట్టుకున్న గంజాయి అక్రమ రవాణాలో రైతులే నేరుగా తరలిస్తూ పట్టుబడడం పోలీసులను ఆశ్చర్య చకితుల్ని చేసింది. ఈ ఘటనలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి, నర్సీపట్నం వైపు వస్తున్న ఐషర్ వ్యాన్ లో వున్న ఐదుగురిలో, ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. మిగిలిన ఇద్దరైన పాంగి రవి, కిముడు రాజేంద్రలను పట్టుకొని పోలీసులు ప్రశ్నించారు.

తమ పొలంలో తాము పండించిన గంజాయిని నేరుగా వ్యాపారస్తులకు అప్పగించి, నగదు తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నామని వివరించారు. దీనిలో భాగంగా చేపల మేత మొక్కజొన్నల మాటున గంజాయిని రవాణా చేస్తున్నట్టు వివరించారు.

ఈ ఘటనలో 1,720కిలోల గంజాయిని పట్టుకున్న నర్సీపట్నం రూరల్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి, వ్యాన్ సీజ్ చేశారు. ఇలాంటి రవాణా విధానం వల్ల వ్యాపారస్తులు తప్పించుకోవడం, పండించిన రైతులే కటకటాల పాలవడం జరుగుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Farmers
  • ganja crop
  • narsipatnam
  • transport
  • Vizag

తాజావార్తలు

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

  • Tragedy : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions