Physical harassment: బెజవాడలో దారుణం.. మహిళను నిర్బంధించి 4 రోజులుగా సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళను గదిలో నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడలో సంచలనంగా మారింది.. బెంజ్ సర్కిల్ ప్రాంతంలో కూలీ పనులు చేసుకునే మహిళకు మాయమాటలు చెప్పి కానూరు తీసుకెళ్లిన నలుగురు దుండగులు.. కానూరు సమీపంలోని ఓ గదిలో నిర్బంధించారు.. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది.. నలుగురు దుండగులు.. నాలుగు రోజుల పాటు మహిళలను చిత్రహింసలకు గురిచేస్తూ.. సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.. మహిళకు మద్యం తాగించి తమ లైంగిక వాంచలు తీర్చుకున్నారు..
Read Also: Shalini Kidnap Case: సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్.. పూజ చేసి బయటకు వస్తుండగా..
Also Read
ఇక, అంతటితో ఆగని దుర్మార్గులు ఆ మహిళను చిత్రహింసలకు గురిచేశారు.. బాధితురాలి శరీరబాగాలపై సిగరెట్లతో కాల్చారు కిరాతకులు.. అయితే, స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనలో ఇప్పటికే నాగరాజు, శ్రీను అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పెనమలూరు పోలీసులు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. ప్రస్తుతం మహిళకు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.. అయితే, ఇప్పటి వరకు మద్యం మత్తు నుంచి కోలుకోలేని పరిస్థితిలోనే ఉంది ఆ మహిళ.. కానీ, మహిళలను కిడ్నాప్ చేసి.. నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడడం.. చిత్రహింసలకు గురిచేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.. కొత్త చట్టాలు వస్తున్నా.. దోషులకు కఠిన శిక్షలు పడుతున్నా.. వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా.. అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉండడం ఆందోళన కలిగించే విషయం.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..