టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. మాజీమంత్రి, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకులు యడ్లపాటి వెంకట్రావు (102) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. 1967లో గుంటూరు జిల్లా వేమూరి నుంచి యడ్లపాటి వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో కాంగ్రెస్‌లో చేరిన యడ్లపాటి.. వేమూరి నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. 1983లో టీడీపీలో చేరిన యడ్లపాటి వెంకట్రావు.. 1995లో గుంటూరు జడ్పీచైర్మన్‌గా…