కాకినాడ జేఎన్టీయూలో ఇంట్రాక్షన్ పేరుతో ర్యాగింగ్ పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసిన 11 మంది విద్యార్థులను పదిహేను రోజుల పాటు సస్పెండ్ చేశారు యూనివర్సీటి ప్రిన్సిపాల్. ఫస్ట్ ఇయర్ పెట్రో కెమికల్ విద్యార్ధిని హాస్టల్‌లో ఇద్దరు సెకండ్ ఇయర్, తొమ్మిది థర్డ్ ఇయర్ పెట్రో కెమికల్ సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ చేశారు. దీంతో.. యూజీసీ యాంటీ ర్యాగింగ్ వెబ్‌సైట్‌కు బాధిత ఫస్ట్ ఇయర్ విద్యార్థి స్నేహితుడు ఫిర్యాదు చేశాడు.
దీంతో.. హాస్టల్ లో ఉంటున్న స్టూడెంట్స్‌తో ర్యాగింగ్ పై యూనివర్శిటీ యాంటీ రాగింగ్ కమిటీ విచారణ జరిపింది. దీంతో ర్యాగింగ్ చేసింది నిజమేనని తెలియడంతో.. మొత్తం 11 మంది విద్యార్ధులను రెండు నెలల పాటు హస్టల్ నుండి, 15 రోజుల పాటు క్లాస్ ల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.