NTV Telugu Site icon

Fake Notes: కావలిలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

ఆదమరిస్తే దొంగనోట్లతో బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. నెల్లూరు జిల్లా కావలి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దొంగనోట్లు చలామణి చేస్తున్న దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేశారు కావలి రూరల్ పోలీసులు. వారి వద్ద నుంచి లక్షా నలభై ఏడు వేల రూపాయలు 500 రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు.నెల్లూరు జిల్లా కావలి, కావలి రూరల్ పరిసర ప్రాంతాల్లో కావలి పట్టణ ప్రాంతంలో దొంగనోట్ల చలామణి భారీగా జరుగుతోంది. గత కొన్ని రోజులుగా దొంగ నోట్లు బయటపడుతున్నాయి.

కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్, నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరామారావు పర్యవేక్షణలో ఈ దొంగనోట్లను చలామణీ చేస్తున్న వారిపై నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా కావలి రూరల్ పోలీసులు ఒక టీంగా తయారయ్యారు. దొంగ నోట్ల చలామణీ చేస్తున్న ఏడుగురిని పట్టుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలకు ఈ దొంగనోట్లు చలామణి చేస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు పరిసర ప్రాంతాలలో ప్రింటింగ్ చేసి ఇక్కడ ఒక బ్రోకర్స్ ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దొంగ నోట్లు చలామణి చేస్తున్నారు. వీళ్ళంతా 30వేలు ఒరిజినల్ నోట్లు ఇస్తే లక్ష రూపాయల దొంగనోట్లు ఇస్తారు.

Read Also: Black Magic: మంత్రాలయంలో క్షుద్రపూజల అలజడి

ఈ ముఠాకు భారీ నెట్ వర్క్ వుంది. కర్నూలులో కూడా ఈ ముఠా దగ్గరి నుంచి దొంగ నోట్లు తీసుకొనిఇంకొక ముఠా కర్నూల్ లో కూడా చలామణి చేస్తోంది. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కావలి రూరల్ పోలీసులు సీఐ ఎస్ఐ వెంకట్రావు పోలీస్ సిబ్బంది ఒక టీంగా ఏర్పడి పట్టుకున్నారు. వీరినుంచి దొంగనోట్లతో పాటు ఒక ప్రింటర్, ఒక కంప్యూటర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన వారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకుని వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.హైదరాబాద్ లోని పఠాన్ షబ్బీర్ ఇంట్లో మురళి అనే అతను కలిసి ఈ దొంగనోట్లను ముద్రించే వాడు. అక్కడినుండి ఆంధ్రప్రదేశ్ లోని కావలి కి తెచ్చి ఇక్కడ మార్చేవారని కావలి అడిషనల్ ఎస్పీ ప్రసాద్, నెల్లూరు ఎస్పీ విజయరామారావు తెలిపారు.