Fake Baba: ఈ దేశంలో సినిమా ఉన్నంత కాలం జనాలు పిచ్చోళ్లు అవుతూనే ఉంటారని ఒక సినిమాలో డైలాగ్ చెప్పినట్టు.. మూఢనమ్మకాలు ఉన్నంతకాలం దొంగ బాబాలు కూడా రాజ్యమేలుతూనే ఉంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా తాజా ఉదంతాన్నే తీసుకోవచ్చు. మేకులు కొడితే దోషం పోతుందని ఓ బాబా చెప్పిన మాటలు నమ్మి.. ఓ మహిళ దారుణంగా మోసపోయింది. విజయవాడలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Fire In Udyan Express: ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. కాసేపు ఆగి ఉంటే..?
సుంకర రజనీ అనే మహిళ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని 35 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. కొంతకాలం నుంచి ఈ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా.. అది అమ్ముడుపోవడం లేదు. దీంతో ఆందోళనకు గురైన రజనీకి ఏం చేయాలో పాలుపోలేదు. తనకు సన్నిహితంగా ఒక మహిళతో ఈ సమస్యని పంచుకుంది. అప్పుడు ఆమె మౌలల అనే ఒక దొంగ బాబాని రజనీకి పరిచయం చేసింది. ఈ బాబా చెప్పింది చేస్తే, భారీ లాభాలకు స్థలం అమ్ముడుపోతుందని నమ్మించింది. ఆమె మాటలు నమ్మి దొంగ బాబాను రజినీ సంప్రదించింది. అతనికి తన స్థలం సమస్య వివరించింది. ఇదే అదునుగా.. భారీ సొమ్ము కాజేందుకు దొంగ బాబా మాస్టర్ ప్లాన్ వేశాడు.
Vijayawada Crime: ఏం కష్టం వచ్చిందో ఏమో.. పెళ్లైన మూడు నెలలకే..?
స్థలం అమ్ముడుపోవాలంటే స్థలంలో నలుదిక్కులా నాలుగు మేకులు కొట్టాలని సూచించాడు. పూజకి రెండున్నర లక్షల ఖర్చవుతుందని చెప్పాడు. అతడు చెప్పినట్టే రజనీ ఆ బాబాకి రెండున్నర లక్షలు ముట్టజెప్పింది. నాలుగు దిక్కులా మేకులు కొట్టింది. ఆమెను నమ్మించేందుకు 100 గంజాల స్థలం అమ్ముడుపోయేలా దొంగ బాబా చేశాడు. అప్పటికీ ఆశ చావని దొంగ బాబా.. స్థలం అమ్మిపెట్టినందుకు కమీషన్ కింద రూ.4 లక్షలు ఇవ్వాలని కోరాడు. లేకపోతే శాపం తగులుతుందని భయపెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన రజినీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ దొంగ బాబా బాగోతం బట్టబయలైంది.