తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం బ్రహ్మపూరి గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పట్ల కులవివక్షత చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన విద్యార్థులకు ఒక పాఠశాల, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు మరో పాఠశాల ఏర్పాటు చేసి బోధన ..దీంతో కుల వివక్షతకు ఆజ్యం పోసిన మండల విద్యాశాఖ అధికారులు. గ్రామ పంచాయితీ సర్పంచ్ సూచనలు మేరకు విద్యార్థుల మధ్య కుల విభజన చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి.
Read Also:ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: హెల్త్ డైరెక్టర్, శ్రీనివాసరావు
దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన అగ్నికుల క్షత్రియ కులసంఘ నాయకులు. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన అగ్నికుల క్షత్రియులు. గ్రామంలో ఒకే పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు చెందినవిద్యార్థులు అందరూ ఒకే పాఠశాలలో చదువుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.