Site icon NTV Telugu

Rajnath Singh: మీ ఉత్సాహం చూస్తుంటే ఏపీలో అధికారంలో వచ్చే నమ్మకం కలుగుతుంది..

Rajnath Sing

Rajnath Sing

ఏలూరులో కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. నర్సాపురం, ఏలూరు, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఏపీలో బీజేపీ అధికారంలో వస్తుంది అనే నమ్మకం కలుగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. పోలవరం కోసం కేంద్రం నిధులు ఇస్తున్న ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచనలో ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు లేవని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ మోడీ చేతుల్లోకి తీసుకుని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

CM Jagan: 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేయాలి.. నేతలకు దిశానిర్దేశం

రాష్ట్రాన్ని వైసీపీ అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదని అన్నారు. పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటే ఆ డబ్బు ఎక్కడికి పోతుందని రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. శాండ్, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా రాష్ట్రాన్ని దోచేసే విధంగా ఇక్కడి ప్రభుత్వం పని చేస్తుందని దుయ్యబట్టారు. తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇచ్చి గౌరవించిన ఘనత బీజేపీకి దక్కుతుందని తెలిపారు. కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు రాష్ట్రానికి ఇస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం పేదలకు మంచినీళ్లు ఇవ్వలేకపోతుందని వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం వైసీపీ.. కుటుంబ పాలన బీజేపీ సహించదని అని పేర్కొన్నారు.

Kotamreddy Sridhar Reddy: వాళ్లు సాధించిందేమీ లేదు.. మాకొచ్చిన నష్టం కూడా ఏమీ లేదు

దేశం పేరు చెబితే గతంలో అంతర్జాతీయ వేదికలపై ఎవరు పట్టించుకునే వారు కాదని… కానీ ఇపుడు మోడీ పేరు చెబితే ప్రపంచ దేశాలు అలెర్ట్ అవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు ఉండేవి.. బీజేపీ పై ఒక్క అవినీతి ఆరోపణ లేదని పేర్కొన్నారు. దేశంలో మూడోసారి బీజేపీ 370కి పైగా సీట్లు సాధిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విరోధులు, ప్రత్యర్థులు మూడోసారి బీజేపీ రాదు అంటున్నారు.. నాలుగోసారి కూడా బీజేపీ వస్తుందని కార్యకర్తలు, ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు.

Exit mobile version