Chintalapudi Gold Heist: ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో గల కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో జరిగిన భారీ చోరీ కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుమారు 3 కోట్ల రూపాయల గోల్డ్ (380 పాకెట్స్)తో పరార్ అయిన అదే సంస్థలో పని చేస్తున్న ఆడిటర్ వడ్లమూడి ఉమామహేష్. అయితే, నిన్న ( సెప్టెంబర్ 9న) ఉదయం 11 గంటలకు హెడ్ ఆఫీస్ విజయవాడ నుంచి బంగారం ఆడిట్ చేయడానికి మహేష్ చింతలపూడికి వచ్చాడు.
Read Also: Trump: భారత్, చైనాపై 100 శాతం సుంకం విధించండి.. ఈయూకు ట్రంప్ సూచన
ఇక, చింతలపూడి గోల్డ్ ఫైనాల్స్ కంపెనీలో పని చేస్తున్న మేనేజర్ యాదల ప్రవీణ్ కుమార్, అదే సంస్థలో క్యాష్ ఇయర్ గా పని చేస్తున్న అమృతాల ఆషాలను బయటకు పంపించిన మహేష్.. 380 పాకెట్స్ బంగారం (సుమారుగా 3 కోట్ల రూపాయలు)తో పరార్ అయ్యాడు. దీంతో మహేష్ చోరీ చేసిన విషయం గుర్తించిన తోటి సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మహేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.