NTV Telugu Site icon

Tragedy In Eluru: దీపావళి రోజు విషాదం.. బైక్‌పై టపాసులు తీసుకెళ్తుండగా పేలుడు

Tragedy In Eluru

Tragedy In Eluru

Tragedy In Eluru: దీపావళి పండుగ రోజున ఏలూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళి టపాసులను బైక్‌పై తీసుకెళ్తుండగా ఒక్కసారి పేలిపోయాయి.. బండి గోతిలో పడి టపాసులు రాపిడికి గురై పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ పేలుడు దాటికి వాటిని తరలిస్తున్న వ్యక్తి శరీరం ముక్కలు ముక్కలుగా ఎగిరిపడింది. పేలుడు దాటికి యాక్టివా బండి పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. మృతుడు దుర్గాసి సుధాకర్‌గా గుర్తించారు.. ఇక, ఈ ఘటనలో తాబేలు సాయి, సతీష్, శశి, శ్రీనివాస్, పెద్దిరాజు తీవ్రగాయాలపాలయ్యారు.. ఈ పేలుడుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.. సుధాకర్‌ మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో.. ఈ ఘటన ఏలూరులో విషాదాన్ని నింపింది.. అయితే, టపాకాయలు కాల్చేటప్పుడే కాదు.. అవి వాహనాల్లో క్యారీ చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు..

Read Also: Diwali Celebrations: పారా మిలటరీ జవాన్లతో కేంద్రమంత్రి దీపావళి వేడుకలు..

Show comments