NTV Telugu Site icon

Alla Nani: ఆళ్ల నాని చేరికకు లైన్‌ క్లియర్‌.. రేపే టీడీపీకి గూటికి మాజీ డిప్యూటీ సీఎం..

Alla Nani

Alla Nani

Alla Nani: మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఆళ్ల నాని.. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.. దీంతో.. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు ఆళ్ల నాని. కొంత మంది కార్యకర్తలు ఆళ్ల నాని చేరికపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఏదేమైన టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని.. ఆళ్ల నాని చేరిక విషయంలో అధిష్టాన నిర్ణయం శిరోధార్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే బడేటి..

Read Also: CM Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం..

ఆ మధ్య టీడీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. అయితే, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు.. ఆళ్ల నాని.. టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.. అంతేకాదు.. ఆళ్లనాని టీడీపీలోకి వస్తే.. ఆయన వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని.. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తేల్చిచెప్పారు.. గతంలో టీడీపీ నేతలను టార్గెట్‌ చేసి.. వేధింపులకు గురిచేశారని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, ఆళ్ల నాని చేరికను పోస్ట్‌పోన్ చేసింది టీడీపీ.. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చించిన తర్వాత.. దీనిపై ఓ నిర్ణయానికి వస్తారని గతంలో ప్రకటించిన అధిష్టానం.. చివరకు ఆళ్లనాని చేరికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.. దీంతో.. రేపే సైకిల్‌ ఎక్కనున్నారు ఆళ్ల నాని..