TTD laddu controversy: టీటీడీ లడ్డు కేసులో హవాలా కోణం.. రూ. 234.5 కోట్ల నిధుల మళ్లింపుపై ఈడీ ఎంక్వైరీ
- టీటీడీ లడ్డు కేసులో హవాలా కోణం..
- హవాలా రూపంలో డబ్బులు మళ్లించినట్లు గుర్తించిన ఈడీ..
- టీటీడీ లడ్డు వ్యవహారంపై విచారణ ప్రారంభించిన ఈడీ..
- హవాలా డబ్బులు ఢిల్లీ నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, విజయవాడలకు చేరినట్లు అంచనా..
- రూ. 234.5 కోట్లకు పైగా నిధుల మళ్లించినట్లు ఈడీ ప్రాథమిక అంచనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD laddu controversy: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రసాదంగా ఇచ్చే లడ్డూ తయారీలో అవకతవకలు, హవాలా లావాదేవీల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక అంశాలను గుర్తించడంతో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ అధికారికంగా విచారణ ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎస్ఐటీ రూపొందించిన నివేదికలో, టీటీడీ లడ్డూ తయారీలో ఉపయోగించే ముడి సరుకుల సరఫరా, కాంట్రాక్టులు, నాణ్యత తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నట్టు సమాచారం. ముఖ్యంగా నెయ్యి సరఫరా, టెండర్ల మంజూరు, ల్యాబ్ పరీక్షల నివేదికల విషయంలో అవినీతి చోటు చేసుకున్నట్టు SIT గుర్తించింది.
Read Also: Ramayana: ‘రామాయణ’లో విజయ్ సేతుపతి? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన మక్కల్ సెల్వన్!
Also Read
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
అయితే, ఎస్ఐటీ నివేదిక ప్రకారం, లడ్డూ తయారీకి సంబంధించిన కొన్ని కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో దేశంలోని పలు నగరాలకు మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్వర్క్ ద్వారా డబ్బు తరలింపులు జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు రూ. 234.5 కోట్లకు పైగా నిధుల మళ్లింపు జరిగినట్టు ప్రాథమిక అంచనాలు ఉన్నాయి. ఈ అక్రమ లావాదేవీల్లో మధ్యవర్తులు, డైరీ సంస్థలు, సరఫరాదారులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతకు సంబంధించిన ల్యాబ్ నివేదికలను ఉద్దేశపూర్వకంగా దాచి, సరఫరా కొనసాగించేందుకు కొందరు అధికారులు సహకరించారని SIT పేర్కొన్నట్టు తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని కూడా అనుమతించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Pawan Kalyan: ‘ఫౌజీ’ భామకు డబుల్ జాక్‌పాట్.. ఏకంగా పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ !
ఇక, ఎస్ఐటీ నివేదిక ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా సంపాదించిన డబ్బును ఎలా మళ్లించారు, ఎవరి ఖాతాల్లోకి వెళ్లింది, ఏ హవాలా ఏజెంట్ల ద్వారా తరలించారు అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. త్వరలోనే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించే తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారం టీటీడీ ప్రతిష్ఠకే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందు భక్తుల భావోద్వేగాలను కూడా దెబ్బతీసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ కేసులో విచారణ వేగవంతం చేయనుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!