Graduates, Teacher Mlc Voters: పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ షురూ

Ap Council

Ap Council

ఏపీలో పట్టభద్రులు- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. 2023 మార్చి 29 తేదీన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండటంతో ఓటర్ల నమోదు ప్రక్రియ షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. 2022 అక్టోబరు 1 తేదీ నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు బహిరంగ ప్రకటన జారీ చేయాలని ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ అయ్యాయి. 2022 నవంబరు 7 తేదీ నుంచి ఫాం 18 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని సూచనలు అందాయి.

Read Also: Kireeti Reddy: ‘జూనియర్’గా జనం ముందుకు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు!

×
×
Ad

2022 నవంబరు 23 తేదీ నాటికి ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. 2022 డిసెంబర్ 30 తేదీనాటికి ఓటర్ల తుది జాబితా రూపొందించాలని ఆదేశాలు. 2023 మార్చి 29 తేదీ నాటికి ముగియనున్న , ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి వై శ్రీనివాసుల రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. అలాగే, కడప- అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి వై గోపాల్ రెడ్డి పదవీ కాలం ముగియబోతోంది.

శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ పదవీ కాలం ముగియబోతోంది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి విఠపు బాలసుబ్రమణ్యం పదవీ కాలం ముగుస్తుంది. కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి కత్తి నర్సింహారెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికారులు ఫోకస్ పెట్టనున్నారు.

Read Also: PM Convoy: కాన్వాయ్‌ ఆపి.. అంబులెన్స్‌కు దారిచ్చిన ప్రధాని మోదీ